ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ఆ టెండర్ల అవినీతిపై నిగ్గు తేల్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్..

ABN, Publish Date - Sep 21 , 2024 | 09:06 AM

అమృత్ పథకానికి టెండర్లు పిలిచి అర్హత లేని వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీలకే కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.

BRS Working President KTR

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమృత్‌ పథకం టెండర్లపై విచారణ జరిపి అక్రమాలు వెలికి తీయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రులు మనోహర్‌లాల్‌ ఖట్టర్, టోచన్‌ సాహులకు ఆయన శుక్రవారం లేఖ రాశారు. దీనిపై విచారణ చేసి నిజనిజాలు నిగ్గుతేల్చాలని లేకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం పాల్పడే అవినీతిలో కేంద్రానికీ వాటా ఉందని నమ్మాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు లేఖ రాసిన విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా తెలియజేశారు.


అర్హత లేని వారికి..

అమృత్ పథకానికి టెండర్లు పిలిచి అర్హత లేని వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీలకే కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. టెండర్లు, పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకం కింద తెలంగాణకు కేంద్రం కేటాయించిన రూ.1500కోట్ల విలువైన పనలను సీఎం రేవంత్ తన కుటుంబసభ్యులకే కేటాయించుకున్నారని ఆరోపిస్తూ లేఖ రాశారు.


కేటీఆర్ ట్వీట్ ఇదే..

"అమృత్ టెండర్ల అవినీతికి సంబంధించి కేంద్ర మంత్రులు శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్, టోచన్‌ సాహుకు లేఖ రాశా. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి తగిన అర్హతలు లేకపోయినా కాంట్రాక్టులు కట్టబెట్టారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్న ముఖ్యమంత్రి కుటుంబ వ్యవహారాలపై నిజానిజాలు వెలికితీసేందుకు విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నా. గత కొన్ని నెలలుగా కేటాయించిన ఈ టెండర్ల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కిస్తోంది. అమృత్ పథకం కింద టెండర్లు పొందిన కంపెనీల వివరాలపై దర్యాప్తు చేసి బహిర్గతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటైన తర్వాత నిర్వహించిన ప్రతీ టెండర్‌ను పరిశీలించాలని, అక్రమాలు జరిగినట్లు తేలితే వెంటనే వాటిని రద్దు చేయాలని కోరా. ఈ టెండర్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నా. అర్హతలు లేకపోయినా అమృత్ టెండర్లు దక్కించుకున్న కంపెనీలపై విచారణ జరపాలి" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Updated Date - Sep 21 , 2024 | 09:11 AM