ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: అమృత్‌ టెండర్ల గురించి సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Sep 29 , 2024 | 07:30 PM

అమృత్‌ టెండర్లకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్‌‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: అమృత్‌ టెండర్లకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్‌‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్‌ కట్టబెట్టింది నిజమని అన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్లను సీఎం ఉల్లంఘించారని కేటీఆర్ విమర్శలు చేశారు. సీఎం బావమరిదితో లీగల్‌ నోటీస్‌ పంపితే భయపడతా అనుకున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.


అశోక్‌ చవాన్‌లా.. సీఎం రేవంత్ దొరికారు..

‘‘మీ అక్రమ దందాల గురించి మాట్లాడనని అనుకున్నారా. నీ బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం. రెండేళ్లలో రూ.2 కోట్ల లాభం ఆర్జించిన చిన్న కంపెనీనే శోధ. ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులూ నిన్ను కాపాడటం కష్టమే. ఆదర్శ్‌ కుంభకోణంలో అశోక్‌ చవాన్‌లా.. నువ్వు దొరికావు’’ అని కేటీఆర్‌ ఆరోపించారు.


పేదల బతుకులతో చెలగాటం

మరోవైపు... మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని తెలంగాణ సర్కార్ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.1.50లక్షల కోట్ల ధన దాహానికి లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు కాబోతున్నారని ఆయన మండిపడ్డారు. పేదల బతుకులతో ముఖ్యమంత్రి చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం కూల్చివేతలు తట్టుకోలేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఇళ్లు కళ్లెదుటే కూల్చివేస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.


ఆనాడు రేవంత్ శవరాజకీయాలు చేశారు..

"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1.50లక్షల కోట్ల ధన దాహానికి ఒకటా రెండా హైదరాబాద్ నగరంలోని లక్షలాది మంది జీవితాలు చెల్లాచెదురవుతున్నాయి. నగరం రోదిస్తోంది. కూల్చివేతలతో ప్రజల గుండెలు పగిలిపోతున్నాయి. వారి ఇళ్లు చెదిరిపోతున్నాయి. ఆడబిడ్డల ఆవేదనలు, ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం రోదిస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న కుటీరాలను కన్నబిడ్డలకు ఇవ్వలేకపోతున్నామని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అమ్మ లాంటి ఇల్లు వదిలి వేరే దిక్కు ఎలా పోతామంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమో అని ఆత్మహత్య చేసుకున్న తల్లి ఒకవైపు, భార్య కడుపుతో ఉన్నా కనికరించరా అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్న భర్త మరోవైపు. బీఆర్ఎస్ హయాంలో రైతుల ప్రయోజనం కోసం 30వేల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో రైతులను రెచ్చగొట్టి శవరాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్. ఆనాడు అలా చేసి నేడు నీ అవసరానికి ఎంత నీచానికైనా తెగిస్తావని మరోమారు నిరూపించావు. మహా నగర ప్రజలారా మీరు అధైర్యపడొద్దు. ఇప్పుడు జరుగుతున్న విధ్వంసంతో తొందరపడి ప్రాణాలు బలితీసుకోవద్దు. న్యాయస్థానాలు ఉన్నాయి. మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇస్తాం..

మరోవైపు ఏళ్ల తరబడి ఉంటున్న తమను ఒక్కసారిగా వెళ్లమనడంపై మూసీ ప్రాంతం ప్రజలు అధికారులను నిలదీశారు. వాగ్వాదాలు, ఘర్షణలకు దిగుతుండడంతో మూసీ నదీ గర్భం (రివర్‌ బెడ్‌)లో రెవెన్యూ అధికారులు మార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్కింగ్ నిలిపివేశారు. మరోవైపు శనివారం నిర్వాసితులతో అధికారులు చర్చలు జరిపారు. మూసీ పక్కన ఇబ్బందులు పడే కంటే.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో ప్రశాంతంగా ఉండాలని స్థానికులకు సూచించారు. డబుల్‌ బెడ్‌ రూమ్ ఇంటి విలువ రూ.30లక్షలకు పైగానే ఉంటుందని చెప్పారు. వీటి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తామని, ఇందు కోసం క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌లను పంపిస్తున్నట్లు అధికారులు నిర్వాసితులకు వివరించారు.


నిర్వాసితులతో మాట్లాడిన ఎమ్మెల్యే, కలెక్టర్‌

సానుకూలత వ్యక్తం చేసినవారిని వెంటనే తరలించారు. కాగా, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి శనివారం మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలతో కలిసి హిమాయత్‌నగర్‌ మండలం వినాయక వీధి (రసూల్‌పూర), శంకర్‌నగర్‌లో స్థానికులతో మాట్లాడారు. 151కుటుంబాలను జియాగూడకు తరలిస్తామని అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల మేర మూసీ పరివాహకం ఉందని చెప్పారు. నదీ గర్భంతోపాటు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో 12,184 అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌ జిల్లాలో 1,595, మేడ్చల్‌లో 239, రంగారెడ్డిలో 332 నిర్మాణాలు నదీ గర్భంలో ఉన్నట్లు తేల్చారు. రెవెన్యూ అధికారులు గురు, శుక్రవారాల్లో హైదరాబాద్‌లో 1,485 నిర్మాణాలకు మార్కింగ్‌ చేశారు. జియాగూడ, నాంపల్లిలో 110 నివాసాలకు మార్కింగ్‌ చేయాల్సి ఉంది. అయితే ఈ పనులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Danam Nagender: కాంగ్రెస్‌లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధం.

Minister Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం..

Minister Ponnam: ఆ విషయంలో సోషల్ మీడియా పుకార్లు నమ్మెుద్దు: మంత్రి పొన్నం..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Sep 29 , 2024 | 08:08 PM