ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: కేసీఆర్‌పై పిచ్చి ప్రచారాలు చేస్తే ఊరుకోం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ మాస్ వార్నింగ్

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:08 AM

సుంకిశాలలో ప్రమాదం కారణంగా ప్రభుత్వానికి రూ. 80 కోట్లు నష్టం చేసిన మేఘా కంపెనీకి పనులను ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఎందుకు మేఘా మీద రేవంత్ రెడ్డికి అంత ప్రేమ అని కేటీఆర్ ప్రశ్నించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఖజానా నింపుకునేందుకు తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు. ఇవాళ(శనివారం) ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.


కేసీఆర్ తెలంగాణకు గర్వకారణం...

‘‘నువ్వు స్లిపర్లు వేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు పనికిమాలిన పోరనిలా తిరుగుతున్నప్పుడే ...ఆయన తెలంగాణ కోసం, ఇక్కడి ప్రజల కోసం తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేశారు. నువ్వు పార్టీ టిక్కెట్ కోసం లాబీయింగ్‌లో బిజీగా ఉన్నప్పుడే...ఆయన తెలంగాణ స్వరాష్ట్రం కావాలని స్వాప్నించాడు. ఎంతో పట్టుదలతో పోరాటం చేసి తెలంగాణ సాధించాడు. తెలంగాణ గొంతుకలను అణచివేయడానికి నువ్వు తుపాకీ పట్టుకున్నప్పుడు... కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు. తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి నీ చేతులు " డబ్బుల బ్యాగులు" పట్టుకున్నప్పుడు...సాధించిన తెలంగాణను దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా తయారు చేసేందుకు ఆయన తన మేధస్సుకు పదును పెట్టారు. సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన కేసీఆర్ ఈ రాష్ట్రానికి గర్వకారణం. నీలాంటి జోకర్ ఆయన మీద పిచ్చి ప్రచారాలు చేస్తూ, దుర్భాషలాడి చరిత్ర నుంచి ఆయన పేరు చెరిపివేయొచ్చని అనుకోవటం మూర్ఖత్వం. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్‌ ఉంటారు. ఆ పేరును ఎవరు చెరిపేయలేరు. గుర్తు పెట్టుకో మిస్టర్ చీప్ మినిస్టర్ రేవంత్’’ అని కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ పనులను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్‌ సంస్థలకు కట్టబెట్టడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి, మేఘా సంస్థకు ఈ టెండర్లు దక్కేలా చేయటమంటేనే నీకిది-నాకది అని క్రోని క్యాపిటలిజానికి పాల్పడుతూ అధికారాన్ని దుర్వినియోగం చేయటమేనని అన్నారు. L&T, NCC లాంటి పెద్ద కంపెనీలకు టెండర్లు దక్కకుండా కావాలనే కుట్ర చేశారని కేటీఆర్ చెప్పారు. L&T, NCC లాంటి సంస్థలను టెక్నికల్ రీజన్స్ పేరు చెప్పి డిస్ క్వాలిఫై చేస్తున్నప్పుడు దీనిపై ప్రజలు ఏమనుకుంటారోనన్న సోయి తప్పి సిగ్గులేకుండా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలాగైనా మేఘా, రాఘవ సంస్థలకు ఈ ప్రాజెక్ట్ కట్టబెట్టాలని మీరు చేసిన తప్పుడు ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ రెండు సంస్థలు చెరి సమానం కేక్‌ను పంచుకున్నట్లు 3.9 శాతం, 3.95 శాతం పంచుకునే విధంగా బిడ్‌లు వేయటమంటే ఇందులో మతలబు ఏంటనీ ప్రశ్నించారు. ఇంత బరితెగించి అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితంగా ప్రజలు బుద్ది చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.


మేఘా సంస్థపై రేవంత్‌కు అంత ప్రేమ ఎందుకు..

సుంకిశాలలో ప్రమాదం కారణంగా ప్రభుత్వానికి రూ. 80 కోట్లు నష్టం చేసిన మేఘా కంపెనీకి పనులను ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఎందుకు మేఘా మీద రేవంత్ రెడ్డికి అంత ప్రేమ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా, ఆంధ్రా కంపెనీ అంటూ ఏ మేఘా కంపెనీపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారో ఇప్పుడు అదే కంపెనీకి సిగ్గులేకుండా ఎందుకు ప్రాజెక్ట్ పనులను అప్పగించారో చెప్పాలని నిలదీశారు. బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సిన కంపెనీకి రేవంత్ రెడ్డి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను బహుమానంగా ఇవ్వటం వెనుక భారీ అవినీతి కుంభకోణం ఉందని కేటీఆర్ ఆరోపించారు.


మేఘా, రాఘవ సంస్థలపై ఫైర్

ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు, రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు పైసలు లేవన్న రేవంత్ రెడ్డి...ఇంత ఖర్చుతో ఎవరి జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘ఓ వైపు తెలంగాణ ప్రజలు మీ చేతగాని పాలనలో బాధపడుతుంటే...మరోవైపు మీరు మాత్రం ప్రజాధనాన్ని లూటీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు’’ అని కేటీఆర్ విమర్శించారు. మొత్తం రూ. 4,350 కోట్ల ఈ ప్రాజెక్ట్‌ను మేఘా, రాఘవ సంస్థలకు అప్పగించి వారి ద్వారా వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొట్టడానికి కుట్ర చేస్తోందని ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే వారు మాత్రం దేశ వ్యాప్తంగా తమ పార్టీ ఖజానా నింపుకునేందుకు రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మేఘా, రాఘవ కన్ స్ట్రక్షన్ అవినీతి బాగోతాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని...మీ అవినీతి పాలనపై పోరాటం చేస్తూనే ఉంటాం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad: ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్‌ వద్ద అనుకోని ఘటన.. భయంతో జనం పరుగులు

Minister Narayana: జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ.. మంత్రి నారాయణ వార్నింగ్

Read Latest Telangana News And Telugu News


Updated Date - Nov 09 , 2024 | 11:19 AM