ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hashish Oil: డ్రగ్స్ కంటే ప్రమాదకారి.. ఎలా తయారు చేస్తారంటే..

ABN, Publish Date - Sep 18 , 2024 | 08:10 AM

గంజాయి, డ్రగ్స్ కంటే అత్యంత ప్రమాదకరమైన మరో మత్తుపదార్థం విక్రయాలు నగరంలో యథేచ్ఛగా సాగుతున్నాయి. హాశిష్ ఆయిల్ అనే పేరుతో డ్రగ్ తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇటీవల దీన్ని విక్రయిస్తూ రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలో ఓ ముఠా పట్టుపడింది.

హైదరాబాద్: తెలంగాణ పోలీసు యంత్రాగం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ హైదరాబాద్ మహా నగరంలో డ్రగ్స్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ వాటిని వినియోగిస్తూ లేదా సరఫరా చేస్తూ నిందితులు ప్రతి రోజూ పట్టుపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పబ్బులు వంటి ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు సైతం ఇటీవల పట్టుపడిన ఘటనలు వెలుగు చూశాయి.


ఇద్దరి అరెస్టు..

గంజాయి, డ్రగ్స్ కంటే అత్యంత ప్రమాదకరమైన మరో మత్తుపదార్థం విక్రయాలు నగరంలో యథేచ్ఛగా సాగుతున్నాయి. హాశిష్ ఆయిల్ అనే పేరుతో డ్రగ్ తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇటీవల దీన్ని విక్రయిస్తూ రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలో ఓ ముఠా పట్టుపడింది. తాజాగా అలాంటి ఘటనే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఎల్బీనగర్ పరిధి ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్లో హాశిష్ అనే మాదక ద్రవ్యాన్ని అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరినీ మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు, ఎల్బీనగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన గశీరాం పొంగి, జగన్నాథ్ కుమిదిగా గుర్తించారు. వారి నుంచి రూ.4.30లక్షల విలువ గల 632గ్రాముల హాశిష్ ఆయిల్, మెుబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‪కు తరలించారు.


విశాఖ ఏజెన్సీ నుంచి..

హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్న మరో అంతర్రాష్ట్ర ముఠాను ఈనెల 16న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి నగరానికి హాశిష్ ఆయిల్ తరలిస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ మహేశ్​భగవత్ వెల్లడించారు. నిందితులను శ్రీకాంత్​రెడ్డి, వెంకటేశ్, కొండల్​రావుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. వారి నుంచి రూ.9.8లక్షల విలువైన హాశిష్​ ఆయిల్, ద్విచక్రవాహనం, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


హాశిష్ ఆయిల్ చాలా డేంజర్..

అయితే హాశిష్ ఆయిల్ ఇతర డ్రగ్స్ కంటే చాలా ప్రమాదకరం. ఇది ఒక్క చుక్క తాగినా ఎంతో మత్తు ఎక్కుతుంది. గంజాయిని బాగా మరిగించిన తర్వాత వచ్చే చిక్కని రసాయనాన్ని ఆయిల్‌గా తయారు చేస్తారు. బహిరంగ మార్కెట్‌లో 10ఎంఎల్​రూ.3,300ధర పలుకుతోంది. అలాగే లీటర్ రూ.3లక్షలకు వరకూ ధర పలుకుతోంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు హాశిష్ ఆయిల్‌కి ఎంత డిమాండ్ ఉందనేది. దీనిపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పక్కా సమాచారంతో దాడులు చేస్తూ నిందితులను కటకటాల వెనక్కి నెడుతున్నారు.

Updated Date - Sep 18 , 2024 | 08:10 AM

Advertising
Advertising