ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mallu Ravi: సుంకిశాల విషయంలో కేటీఆర్ బాధ్యత తీసుకోవాలి

ABN, Publish Date - Aug 09 , 2024 | 05:39 PM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 2021లో సుంకిశాల దగ్గర ఫౌండేషన్ వేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి (Mallu Ravi) తెలిపారు. మేఘ ఇంజినీరింగ్ వర్క్స్‌కి నిర్మాణ పనులు దక్కాయని చెప్పారు. సుంకిశాలకు కర్త, కర్మ, క్రియా మొత్తం కేటీఆరే బాధ్యత అని స్పష్టం చేశారు.

Mallu Ravi

ఢిల్లీ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 2021లో సుంకిశాల దగ్గర ఫౌండేషన్ వేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి (Mallu Ravi) తెలిపారు. మేఘ ఇంజినీరింగ్ వర్క్స్‌కి నిర్మాణ పనులు దక్కాయని చెప్పారు. సుంకిశాలకు కర్త, కర్మ, క్రియా మొత్తం కేటీఆరే బాధ్యత అని స్పష్టం చేశారు.

సుంకిశాలలో జరిగిన నష్టాన్ని ఆ కాంట్రాక్టర్‌తోనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పైసా కూడా వృథా ఖర్చు చేయరాదని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. శుక్రవారం నాడు ఢిల్లీ వేదికగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ... 2021లో పనులు ప్రారంభించి, 2023కి పనులు పూర్తి చేశారని.. కొంతమేర శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే టెండర్లు, పనులు, నిర్మాణ వ్యయం పెంపు వంటి అంశాలు అన్ని జరిగాయని గుర్తుచేశారు. రూ.1400 కోట్లతో మొదలుపెట్టి రూ. 2వేల కోట్లకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఎంపీ మల్లురవి తేల్చిచెప్పారు.


విదేశాలకు కేసీఆర్ ఎందుకెళ్లలేదు..

ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు భారీగా చేరి వాల్ కూలిపోయిందని అన్నారు. నాసిరకంగా ప్రాజెక్టులు కట్టడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని చెప్పారు. కేటీఆర్ ఇష్టారీతిన తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో ఏం చేసిన అడిగేవారు లేరన్నట్లుగా వ్యవహరించిన కేటీఆర్ సుంకిశాల దగ్గర పనులు మొదలుపెట్టారని చెప్పారు. కాళేశ్వరం కేసీఆర్, సుంకిశాల విషయంలో కేటీఆర్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ మాటలు రాజకీయాల్లో విలువ లేకుండా చేస్తున్నాయని అన్నారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు విదేశాలకు వెళ్లలేదని ప్రశ్నించారు. కేటీఆర్ మీద నమ్మకం లేకే దావోస్ నుంచి పెట్టుబడులు రాలేదని విమర్శించారు. కేసీఆర్ వెళ్లలేదు కాబట్టే పెట్టుబడిదారులకు నమ్మకం కలగలేదని ఎంపీ మల్లురవి స్పష్టం చేశారు.


అమెరికా చాలా ప్రాజెక్టుల్లో రేవంత్...

పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేందుకే సీఎం రేవంత్ రెడ్డి, సీఎంతోపాటు మంత్రి, అధికారులు అందరూ అమెరికా వెళ్లారని స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు అవాకులు చెవాకులు మాట్లాడటం విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు నుంచే అమెరికాలో ఉన్నారని.. చాలా ప్రాజెక్టుల్లో భాగం అయ్యారని గుర్తుచేశారు. నిర్ణిత సమయంలో ప్రాజెక్టులు ప్రారంభం కాకపోతే అప్పుడు అడగాలి, కానీ బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగతంగా అప్రదిష్టపాలు చేయాలని చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ వ్యవహరించడం లేదని ఎంపీ మల్లు రవి అన్నారు.


బీజేపీ‌తో కుమ్మక్కు..?

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు బీజేపీ‌తో కుమ్మక్కై గులాబీ పార్టీ ఓట్లను బీజేపీకి ఓట్లు వేయించారని ఆరోపించారు. 8 మంది బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల డిపాజిట్లు పోయాయని గుర్తుచేశారు. కేసీఆర్ పార్టీకి నష్టం వచ్చిన కమలం పార్టీని బతికించేలా పనిచేయలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే బీజేపీతో కలిసి పనిచేశారని విమర్శించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా గులాబీ నేతలు వ్యవహరించడం లేదని, తిట్టడం, బద్నాం చేయడంతోనే కేసీఆర్ పార్టీ నేతలు సరిపెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

Updated Date - Aug 09 , 2024 | 06:15 PM

Advertising
Advertising
<