ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Politics: కేసీఆర్ రికార్డు బ్రేక్ చేస్తున్న కేటీఆర్.. కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Nov 23 , 2024 | 12:28 PM

అబద్దాల యూనివర్సిటీలో పట్టా పొందిన వ్యక్తి మాజీ మంత్రి కేటీఆర్ అని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టుసాయి ఎద్దేవా చేశారు. దినం దినం కేటీఆర్ దిమాక్ చిన్నగా అవుతోందని విమర్శలు చేశారు.

హైదరాబాద్: మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్‌రావు అబద్ధాలు చెప్పడంలో పోటీ పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టుసాయి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణకు అవార్డు వస్తే మాజీ సీఎం కేసీఆర్ వల్లే అవార్డు వచ్చిందని కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. దినం దినం కేటీఆర్ దిమాక్ చిన్నగా అవుతోందని విమర్శలు చేశారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్‌లో మెట్టుసాయి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, తాగడం వల్లనో కానీ కేటీఆర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.


కేటీఆర్ మెదడుకు చిల్లు పడితే తమ ప్రభుత్వం తరపున వైద్యం చేయిస్తామని అన్నారు. కేటీఆర్ మాటలకు మత్స్యకారులు నవ్వుతున్నారని విమర్శించారు. అబద్దాల యూనివర్సిటీలో పట్టా పొందిన వ్యక్తి కేటీఆర్ అని దెప్పిపొడిచారు. దాచేసిన సత్యం అంటూ అసలు సత్యాన్ని కేటీఆర్ దాచేశారని ఆరోపించారు.కేటీఆర్ జీవితంలో ఒక్కరోజైనా అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా అని ప్రశ్నించారు. కేసీఆర్ అబద్దాల రికార్డు బ్రేక్ చేసేందుకు కేటీఆర్ కష్టపడుతున్నారని అన్నారు.


తమ హయాంలో చేసిన పనిని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే అది తమ ఘనత అంటూ కేటీఆర్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇందిరా మహిళా శక్తికి అవార్డు వచ్చింది. అది ఎవరిదో కేటీఆర్ చెప్పాలని అన్నారు. రేవంత్ ప్రత్యేక శ్రద్ధతో మహిళాభివృద్ధికి పథకం తీసుకువస్తే ఆ క్రెడిట్ మీరు తీసుకుంటారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మహిళలకు ఇచ్చిన సబ్సిడీని తాము పెంచామని గుర్తుచేశారు. 32 మొబైల్ ఫిష్ క్యాంటీన్లు ప్రారంభించామని గుర్తుచేశారు. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేందుకు తీసుకున్న నిర్ణయాలకు తమకు అవార్డు వచ్చిందని తెలిపారు. బీమా పథకం ద్వారా 4 లక్షల 16 మంది సభ్యుల జీవితాలు కాపాడేందుకు రూ.139 కోట్లు ప్రీమియం చెల్లించినందుకు అవార్డు వచ్చిందని మెట్టుసాయి పేర్కొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 12:30 PM