ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Komati Reddy: వాళ్ల వ్యాఖ్యలపై నేను స్పందించను.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Nov 28 , 2024 | 03:19 PM

ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ గురుకులాలకు పోదామంటే తాను వస్తాను.. కానీ పిలగాళ్లు కేటీఆర్, హరీష్ వాఖ్యలపై తాను మాట్లాడనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చుకుంటామని తెలిపారు.

నల్గొండ: తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారికి వచ్చే జనవరి చివరిలో టెండర్లు పిలిచి మార్చిలోపు ఆరు లైన్ల రహదారిగా మార్చుతామని చెప్పారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రూ. 30 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీలను ఆహ్వానించి వారితో శంకుస్థాపన చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.


తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ. 500కు సిలిండర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తారని.. ఆ తేదీని రేపు ప్రకటిస్తామని చెప్పారు. పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మెడికల్ కాలేజ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడతారని అన్నారు. ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ గురుకులాకు పోదామంటే తాను వస్తాను.. కానీ పిలగాళ్లు కేటీఆర్, హరీష్ వాఖ్యలపై తాను మాట్లాడనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.


ALSO READ: Harish Rao: రేవంత్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోంది.. హరీష్‌రావు ధ్వజం

రైతులను బీఆర్ఎస్ నేతలు ఉసిగొలుపుతున్నారు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ: అధికారులపై దాడులు చేయడానికి రైతులను బీఆర్ఎస్ నేతలు ఉసిగొల్పుతున్నారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని తెలిపారు. ఉద్యోగాల నియమకాలు ఇవ్వకుండా 10 సంవత్సరాలు ఏం చేశారు.. గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను నాశనం చేసి, భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. మాజీ మంత్రి హరీష్ రావుకు పిచ్చికుక్క కరిసినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. రైతులకు బోనస్ ఇస్తామంటే హరీశ్ రావు అంతా బోగస్ అంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ విమర్శలు చేయడానికే బీఆర్ఎస్ ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజమెత్తారు.


ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ఆదిలాబాద్ - మెదక్ - కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగిందని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ సిట్టింగ్ సీటులో మళ్లీ తామే గెలుస్తామని చెప్పారు. అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం త్వరలోనే నిర్ణయిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ ‌రెడ్డి స్పష్టం చేశారు.


ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఎన్‌రోల్‌మెంట్ జరుగుతోందన్నారు. లాస్ట్ టైం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను పోటీ చేయమని చెప్పారని గుర్తుచేశారు. ప్రశ్నించే గొంతుకగా తనకు కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం కల్పించిందని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం చేపట్టిన పాజిటివ్ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. చరిత్రలో లేని విధంగా పది నెలల్లో 50 నుంచి 60వేల ఉద్యోగాలు ఇచ్చామని ఉద్ఘాటించారు. నిరుద్యోగులకు తమ ప్రభుత్వం ఒక సదవకాశం ఇచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ ‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: దేనికి విజయోత్సవాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్...

Telangana: ఫుడ్ పాయిజన్‌కు కారణం ఇదే.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

Hyderabad: రేపు 4,250 బైక్‌లతో దీక్షాదివస్‌ వరకు ర్యాలీ

Read Latest Telangana News and Telugu News

Updated Date - Nov 28 , 2024 | 03:39 PM