Minister Komati Reddy: అనాథ బాలికకు అండగా మంత్రి కోమటి రెడ్డి

ABN, Publish Date - Aug 19 , 2024 | 10:45 AM

నిర్మల్ జిల్లా, తానుర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ అనే చిన్నారి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన దీనగాథ గురించి సమాచార మాధ్యమాల్లో చూసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చలించిపోయారు.

Minister Komati Reddy: అనాథ బాలికకు అండగా మంత్రి కోమటి రెడ్డి

నిర్మల్: నిర్మల్ జిల్లా, తానుర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ అనే చిన్నారి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన దీనగాథ గురించి సమాచార మాధ్యమాల్లో చూసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చలించిపోయారు. తల్లిదండ్రులు, ఉండటానికి ఇళ్లు లేక చిన్నారి పడుతున్న కష్టం ఆయన హృదయాన్ని కలిచివేసింది. ఎలాగైనా ఆ చిన్నారికి అండగా నిలవాలని మంత్రి భావించారు. స్వయంగా రంగంలోకి దిగి దుర్గకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టారు.


తానుర్ మండల తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీఓ అబ్దుల్ సమద్ ద్వారా తన తనయుడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాదు.. చిన్నారి తను ఎంత వరకు చదివితే అంత వరకు చదివిస్తానని.. అన్ని సౌకర్యాలు కల్పించి పెళ్లి అయ్యేంత వరకు అండగా ఉంటానని దుర్గకు మాటిచ్చారు. చిన్నారితో వీడియో కాల్ మాట్లాడిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. అధైర్యపడవద్దని, తాను ఉన్నానని భరోసా కల్పించారు.


ప్రతి నెల ఖర్చుల కోసం పంపుతనని, ఉండటానికి ఇల్లు కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు, త్వరలో పాపను కలుస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమాని స్థానిక నాయకులు సతీష్ రెడ్డి, చిన్నారెడ్డి, కొట్టే కృష్ణ, స్థానిక తాజా మాజీ సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ మధు పటేల్, దేవదాసు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 10:45 AM

Advertising
Advertising
<