Ponguleti: ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్లట్లేదు.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Jul 30 , 2024 | 07:12 PM
ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదని.. అదంతా గులాబీ నేతలు చేసుకుంటున్నా ప్రచారమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఎక్కడికి పోరని తేల్చిచెప్పారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదని.. అదంతా గులాబీ నేతలు చేసుకుంటున్నా ప్రచారమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఎక్కడికి పోరని తేల్చిచెప్పారు. మంగళవారం నాడు అసెంబ్లీ లాబీలో మీడియాతో పొంగులేటి చిట్ చాట్ చేశారు. పాత పరిచయం కాబట్టి కలసి ఉంటారని అన్నారు. తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు ఇబ్బంది కలగకుండా ఉంటారని చెప్పారు. తమ దగ్గర ప్రేమ రాజకీయాలు ఉంటాయని అన్నారు. ఎవరు ఎక్కడికి పోరని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Yennam Srinivas Reddy: అలా చేసే దమ్ముందా.. BRSకు కాంగ్రెస్ MLA సవాల్
బీఆర్ఎస్ కావాలనే లీక్‌లు ఇస్తుంది: ఆది శ్రీనివాస్
హైదరాబాద్: ఎమ్మెల్యేలు ఎవరు బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) స్పష్టం చేశారు. మంగళవారం నాడు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు కావాలని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌కు అక్కడి స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదని అన్నారు. బీఆర్ఎస్ కావాలనే లీక్‌లు ఇస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌లోకి వచ్చిన అందరూ ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉంటారని.. బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎమ్మెల్యేలు వస్తారని ఆది శ్రీనివాస్ తేల్చిచెప్పారు.
నేను కచ్చితంగా మంత్రిని అవుతా: ఎమ్మెల్యే రంగారెడ్డి
తాను కచ్చితంగా మంత్రిని అవుతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (MalReddy Ranga Reddy) ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు మల్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఏ శాఖ మంత్రి అవుతాను అనేది మాత్రం చెప్పలేనని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను తానని గుర్తుచేశారు. తనకు మంత్రి పదవి రాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో 40శాతం జనాభా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నారని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను విస్మరించినట్లేనని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
TS News: నార్సింగీలో బుల్లెట్ బీభత్సం
CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల: సీఎం రేవంత్ రెడ్డి
TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?
TS News: సాఫ్ట్‌వేర్ యువతిపై సామూహిక అత్యాచారం..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 30 , 2024 | 09:55 PM