Damodar Narasimha: నాణ్యమైన డాక్టర్లను అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ
ABN, Publish Date - Jun 19 , 2024 | 06:09 PM
తెలంగాణ(Telangana)లోని ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల (Private Medical Colleges) యాజమాన్యం, డీన్‌లు, ప్రిన్సిపాల్స్‌తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి మంత్రి వివరించారు.
హైదరాబాద్: తెలంగాణ(Telangana)లోని ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల(Private Medical Colleges) యాజమాన్యం, డీన్‌లు, ప్రిన్సిపాల్స్‌తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి మంత్రి వివరించారు. కళాశాలల సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై వారితో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి చెప్పారు. మెరుగైన విద్యను విద్యార్థులకు అందించి ఉత్తమ డాక్టర్లుగా వారిని తీర్చిదిద్దాలని కళాశాల యాజమాన్యాలకు సూచించారు.
తెలంగాణలో నాణ్యమైన డాక్టర్లను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రాజనర్సింహ చెప్పారు. హెల్త్ ఎడ్యుకేషన్‌కు తెలంగాణను బెస్ట్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలలతోపాటు డెంటల్ కాలేజీల్లోనూ మెరుగైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య విద్య అందించేందుకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యానికి సంబంధించి మూడు రకాల టాస్క్‌ఫోర్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల పర్యవేక్షణ కోసం క్లినికల్ ఎస్టాబ్లిష్, ఫార్మా మెడికల్లో డ్రగ్స్ నియంత్రణకు, ఫుడ్ క్వాలిటీ కోసం ఇలా మూడు టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.
Updated Date - Jun 19 , 2024 | 06:11 PM