Kaushik Reddy: రేవంత్ రెడ్డి.. నీ గుండెల్లో నిద్రపోతా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

ABN, Publish Date - Sep 16 , 2024 | 01:51 PM

తనను హత్య చేయమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పంపించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kaushik Reddy: రేవంత్ రెడ్డి.. నీ గుండెల్లో నిద్రపోతా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..
BRS MLA Kaushik Reddy

హైదరాబాద్: తనను హత్య చేయమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పంపించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డిని హత్య చేయాలంటూ తానే పంపించినట్లు పరోక్షంగా సీఎం చెప్పారని ఆయన వెల్లడించారు. కానీ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవపడ్డారని అంటున్నారని, వారిద్దరూ చెప్పే మాటలకు ఎక్కడా పొంతన లేదని ఎమ్మెల్యే అన్నారు. తనపై హత్యాయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని తెలంగాణ డీజీపీని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.


సీఎంపై కేసు పెట్టాలి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.."నాపై దాడి చేసేందుకు తానే పంపినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. నన్ను హత్య చేయాలని ఎందుకు అనుకుంటున్నారు సీఎం గారు?. మీరిచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ప్రశ్నిస్తున్నా కాబట్టి హత్య చేయాలని అనుకుంటున్నారా?. రేవంత్ నన్ను హత్య చేయాలని ఒప్పుకున్నారు. దీనిపై డీజీపీ, హోమ్ సెక్రటరీ స్పందించాలి. లేకుంటే గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మను కలుస్తాం. సీఎంపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయంలో సైబరాబాద్ సీపీ డైనమిక్‌గా పని చేయాలి.


ఎవరినీ వదలం..

ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ ఎటాక్ చేపిస్తే ఇప్పటివరకూ చర్యలు తీసుకోరా?. కాంగ్రెస్ పాలన శాశ్వతం కాదు.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం. చంపితే చావడానికి సిద్ధమే, కానీ రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ మాత్రం కాను. ఆరు హామీలు అమలు చేసే దాకా సీఎం గుండెల్లో నిద్రపోతా. నా ఇంటికి వచ్చావ్. నన్ను పీసీసీ చీఫ్ చేయమని నా కాళ్లు మొక్కినవ్. తెలంగాణ నీ అయ్య జాగీరా?. చంపేస్తామంటూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. భయపడేది లేదు. నన్ను ఎవరైనా హత్య చేస్తే రేవంత్ రెడ్డిదే బాధ్యత.


ఆ ఇల్లు కూల్చరా?

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి హైడ్రా నోటీసులు ఇచ్చి 20రోజులు అవుతుంది. ఇప్పటివరకూ ఇల్లు ఎందుకు కూల్చలేదు. తన అన్న ఇల్లు కూల్చుతానని చెప్పిన సీఎం ఆయనకు మరో ఇల్లు ఇప్పించారు. బిల్డర్‌ను బెదిరించి మరీ తన సోదరుడికి ఇంటిని ఇప్పించారు. మరి పేద ప్రజల పరిస్థితి ఏంటి?" అంటూ ప్రశ్నించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

komatireddy: వైన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు: మందు బాబులకు క్లాస్

Ponnam Prabhakar: గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి

TG News: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?

Updated Date - Sep 16 , 2024 | 02:04 PM

Advertising
Advertising