Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు?
ABN, Publish Date - Mar 30 , 2024 | 09:24 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తిరుపతన్న, భుజంగ రావును అధికారులు రెండో రోజు కస్టడీ విచారణ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో న్యాయవాది సమక్షంలో ఇద్దరిని రెండవ రోజు దర్యాప్తు బృందం విచారించనుంది.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. బంజారాహిల్స్ (Banjara Hills) పోలీస్ స్టేషన్‌లో తిరుపతన్న, భుజంగ రావును అధికారులు రెండో రోజు కస్టడీ విచారణ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో న్యాయవాది సమక్షంలో ఇద్దరిని రెండవ రోజు దర్యాప్తు బృందం విచారించనుంది. భుజంగరావు, తిరుపతన్న నుంచి ఇప్పటికే కీలక సమాచారాన్ని దర్యాప్తు బృందం సేకరించనుంది. భుజంగరావు, తిరుపతన్న స్టేట్ మెంట్ కీలకంగా మారనుంది. వీరి ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
Congress: నేడు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కీలక నేతలు..
రాధా కిషన్ ఇచిన స్టేట్‌మెంట్ ఆధారంగా వీరిద్దరి ప్రమేయంపై అరా తీస్తున్నారు. భుజంగ రావు తిరుపతన్న సర్వీస్‌లో అక్రమ దందా వసూళ్లపై ఆరా తీస్తున్నారు. ఎస్ఐబీ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్, ప్రణీత్ రావుతో వీరికి ఉన్న లింక్స్ పై ఆరా తీస్తున్నారు. సిరిసిల్ల, హైదరాబాద్ (Hyderabad), వరంగల్ (Warangal) సర్వర్ ఏర్పాటు ఎస్ఐబీ (SIB) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు బృందం ప్రశ్నించనుంది. ఎవరి డైరెక్షన్‌లో ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడ్డారనే విషయమై అధికారులు ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. ఎంత మంది ప్రైవేట్ వ్యక్తులకు ఎవరు లొకేషన్ చేరవేశారు..? ఆన్న అంశాలపై దర్యాప్తు బృందం ఆరా తీయనుంది.
మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోనే మాటల యుద్ధం జరుగుతోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్‌నూ తాకిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు పేరు వెలుగులోకి రాగా.. తాజాగా శివారు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ మాదిరి విభాగానికి(ఎస్‌వోటీ) ఇన్‌చార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 30 , 2024 | 09:24 AM