ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mallu Ravi: సీఎం రేవంత్ రెడ్డి నిశ్శబ్ద విప్లవ నాయకుడు: ఎంపీ మల్లు రవి..

ABN, Publish Date - Oct 13 , 2024 | 03:55 PM

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. తమిళనాడులో కరుణానిధి, జయలలితను విప్లవ నాయకులు అంటారని, ఇకపై సీఎం రేవంత్ రెడ్డిని కూడా అలానే పిలవాలని ఎంపీ అభిప్రాయపడ్డారు.

MP Mallu Ravi

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిశ్శబ్ద విప్లవ నాయకుడని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తమిళనాడులో కరుణానిధి, జయలలితను విప్లవ నాయకులు అంటారని, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డినీ అలానే పిలవాలని ఎంపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారని మల్లు రవి అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.


మాకు పాఠాలు నేర్పకండి..

ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.."మూసీ విషయంలో ప్రతిపక్షాల దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ప్రక్షాళన, ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదనే విషయం మాకూ తెలుసు. బీఆర్ఎస్ నాయకులు రూ.7లక్షల కోట్లు అప్పు తెచ్చి తెలంగాణకు ఏమి చేశారో చెప్పాలి. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. యువకుల కోసం స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చారు. రాజ్యాంగ విలువల్ని కాపాడింది సీఎం రేవంత్ రెడ్డి అయితే రాజ్యాంగ హక్కులను కాలరాయాలని చూసేది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. మూసీ ప్రక్షాళన, హైడ్రా వల్ల ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటి వల్ల హైదరాబాద్‌లో లక్షల మందికి లాభం జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయింది.


ఐదు వేల పాఠశాలలు మూతేశారు..

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 5 వేల పాఠశాలలు మూతపడ్డాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధన, భోజన వసతులతో గురుకులాలు నిర్మించబోతుంది. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 2,500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఈబీసీ విద్యార్థులందరికీ ఒకే చోట విద్య అందించబోతున్నాం. యంగ్ ఇండియా గురుకులాలతో సమాజంలో సమూలమైన మార్పు వస్తుంది. అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. వేల కోట్లతో కట్టిన సచివాలయం, ప్రజాభవన్ ఎవరికి ఉపయోగపడుతున్నాయి?. గత పాలకులకు సౌకర్యాల కోసం ప్రజాధనాన్ని వృథా చేశారు" అని అన్నారు.


మురికి కూపాలుగా మార్చారు..

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రీతమ్ అన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల చెవులలో పువ్వులు పెట్టిందని ఆయన మండిపడ్డారు. గత పాలకులు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేశారని ప్రీతమ్ ఆరోపించారు. విద్యా శాఖకు రూ.21,292 కోట్ల బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు స్వాతిస్తున్నారని అన్నారు. గత పదేళ్లపాటు స్కూల్స్, హాస్టళ్లలో కనీస వస్తువులు అందించకుండా వాటిని మురికి కూపాలుగా మర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల్లో ఆ మురికి కూపాలను కాంగ్రెస్ ప్రభుత్వం కడిగేసిందని ఆయన చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రీతమ్ చెప్పారు.


బీఆర్ఎస్‌ది పాశవిక పాలన..

తెలంగాణలో గత పదేళ్లపాటు ఆటవిక, పాశవిక పాలన కొనసాగిందని బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఆగిపోయిన అభివృద్ధికి, నిర్లక్ష్య ధోరణికి సీఎం రేవంత్ రెడ్డి చరమగీతం పాడుతున్నారని ఆయన అన్నారు. ఉన్నత కుటుంబాలతో సమానంగా పేద విద్యార్థులకు విద్య అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా గురుకులాల స్థాపన జరుగుతోందని చెప్పారు. అంతర్జాతీయంగా ప్రమాణాలతో కూడిన విద్యను పేద విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని శ్రీకాంత్ గౌడ్ కొనియాడారు. విద్యా, వైద్య రంగాలు గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రతి నియోజకవర్గంలోనూ గురుకులాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని నూతి శ్రీకాంత్ గౌడ్ చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Alai Balai: తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలిపిన ‘అలయ్ బలయ్’

Nara Rohit: నటి సిరితో నారా రోహిత్ ఎంగేజ్ మెంట్..

Updated Date - Oct 13 , 2024 | 03:57 PM