ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mynampally: బీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

ABN, Publish Date - Oct 01 , 2024 | 02:08 PM

గ్రేటర్ హైదరాబాద్‌లో మూసి పక్కన ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చారు. ముకేష్ అంబానీ తలుచుకుంటే మధ్యతరగతి వారు తీసుకున్న లోన్లు మాఫీ చేయొచ్చని అన్నారు.

Mynampally Hanumanth Rao

సిద్దిపేట జిల్లా: కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు. స్టాండర్డ్ మీడియాను మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లు భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఆర్.అండ్.ఆర్ కాలనీలోని మల్లన్న సాగర్ ముంపు బాధితులను మైనంపల్లి హనుమంతరావు, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి ఇవాళ(మంగళవారం) పరామర్శించారు.


ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాద్‌లో మూసి పక్కన ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముకేష్ అంబానీ తలుచుకుంటే మధ్యతరగతి వారు తీసుకున్న లోన్లు మాఫీ చేయొచ్చని అన్నారు.


హరీష్‌రావు,కేటీఆర్‌లకు వార్నింగ్

‘‘హరీష్‌రావు, , కేటీఆర్‌లకు గజ్వేల్ నుంచి హెచ్చరిస్తున్నా ఏ ఒక్క ప్రాణం పోయినా మీరే బాధ్యత వహించాలి. ఏ ఒక్కరూ మరణించినా సహించేది లేదు. మల్లన్న సాగర్‌లో పోయినా ఇళ్లలో రూ. 30 లక్షల మార్కెట్ విలువకు రూ.5 లక్షల ఇచ్చారు. రైతుబంధు పేరుతో ఇటు ఇచ్చి ఫర్టిలైజర్ రూపంలో లాక్కుంటారు. ఫాం హౌస్‌కు రోడ్డు వేస్తే ఒక ఊరు మొత్తం పోయింది. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కడితే నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని అప్పుడు కేసీఆర్ అన్నాడు. మూసీ నది శుభ్రం చేయడం వల్ల ఎంతో లాభం ఉంది. దీనివల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలను అవసరమైతే వారిని ఆదుకుంటా. హరీష్‌రావు, కేటీఆర్ మీరు పేద ప్రజలను అండగా ఉంటారా’’ అని మైనంపల్లి హనుమంతరావు అడిగారు.


రూ. 50 కోట్లు బ్లాక్ మెయిల్

‘‘కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రూ. 50 కోట్లు బ్లాక్ మెయిల్ చేశాడు. వేల కోట్ల రూపాయలు కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు వాడారు. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ఆపారు. అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సలహాలు ఇవ్వాలి. హైదరాబాద్‌లో నష్ట పోయిన వారికి అన్ని పార్టీల సహకారంతో నిర్వాసితులకు కావలసిన నష్ట పరిహారాన్ని అందజేస్తాం. హరీష్‌రావు రెండు రోజుల్లో హసీఫ్‌నగర్‌లో ఉన్న నీ ఫాం హౌస్‌కు వస్తున్నా. చెరువులో నీ ఫాం హౌస్‌ను కట్టుకున్నావ్. వరదలు వచ్చినప్పుడు 24 గంటలు నీళ్లలో ఉన్నా. మీరేమో ఫాం హౌస్‌ కోసం ఊర్లకు ఊర్లు కూలుస్తారు. హైడ్రా విషయంలో బీజేపీతో సహా అన్ని పార్టీలు సహకరించాలి. విజయవాడ మాదిరిగా హైదరాబాద్ కాకూడదు. కేసీఆర్ ఫాం హౌస్ నుంచి, షాద్ నగర్ వద్ద ఉన్న హరీష్ రావు ఉన్న 70 ఎకరాల్లో నుంచి ఆర్ ఆర్ ఆర్‌కు రోడ్డు పోవాలి’’ అని మైనంపల్లి హనుమంతరావు వార్నింగ్ ఇచ్చారు.


ఇష్టారీతిన అనుమతులు ఇచ్చారు...

‘‘చెరువులు అన్ని కబ్జా అయితే వర్షం వస్తే నీళ్లు ఎక్కడికి వెళ్లాలి. ఇష్టారీతిన అనుమతులు ఇచ్చి హరీష్‌రావు, కేటీఆర్‌లు లక్షల కోట్లు ఆక్రమించారు. తెలంగాణను అప్పుల పాలు చేసి కేసీఆర్ కుటుంబం తెలంగాణను మొత్తం దోచుకుంది. తెలంగాణ ప్రజలందరి మీద ఒక్కొక్కరికి లక్షన్నర చొప్పున అప్పులు చేసి పెట్టారు. రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలనేది రేవంత్ లక్ష్యం. లక్షలాది మంది చనిపోతే తక్కువగా చేసి చూపించిన ఘనత మీది. కేసీఆర్, హరీష్‌రావు దమ్ముంటే మీ డబ్బులు పేదలకు పంచి ఇవ్వాలి, నేను నా ఆస్తులు ఇస్తా. మీ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలో ఇక ఉండేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే. బీఆర్ఎస్ పని అయిపోయింది. హైడ్రా వల్ల 10 నుంచి 15 శాతం నష్ట పోవచ్చు కానీ వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. బీజేపీ పార్టీ కూడా హైడ్రా విషయంలో సహకరించాలి, అవసరమైతే మీరు కూడా సాయం చేయాలి. ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. హైడ్రా పరిస్థితి ఒక కొలిక్కి వచ్చాక మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం’’ అని మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చారు.

Updated Date - Oct 01 , 2024 | 02:20 PM