ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Niranjan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు భ్రమలు తొలిగాయి

ABN, Publish Date - Aug 05 , 2024 | 03:54 PM

కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు ఉన్న భ్రమలు తొలిగాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతుభరోసాపై కేబినెట్‌లో ఎందుకు చర్చించలేదు..? శాసనసభలో ఎందుకు ప్రకటించలేదు..? అని ప్రశ్నించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు ఉన్న భ్రమలు తొలిగాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) విమర్శించారు. రైతుభరోసాపై కేబినెట్‌లో ఎందుకు చర్చించలేదు..? శాసనసభలో ఎందుకు ప్రకటించలేదు..? అని ప్రశ్నించారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.  మహిళలకు రూ.2500 , ఫించన్ రూ.4000 ఇచ్చిందేమీ లేదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.


ALSO Read: BRS MLA'S: గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS ఎమ్మెల్యేల ధ్వజం

హోల్ సేల్‌గా అబద్దాలు

రైతుబంధు, రైతుభరోసాపై ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. అరకొరగా రుణమాఫీ చేసి అంతా అయిపోయిందని భ్రమింపచేసే ప్రయత్నాలు చేస్తుందని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ  హోల్ సేల్ గా అబద్దాలు చెప్పిందని విమర్శించారు. రైతుబంధు, రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న, చిన్న కారణాలతో రైతుల రుణమాఫీకి ప్రభుత్వం నిరాకరిస్తుందని అన్నారు. పట్టాదార్ పాస్ బుక్ ఉండి రుణమాఫీ కానీ రైతులతో చర్చకు ప్రభుత్వం సిద్దమా ? అని నిలదీశారు. 8374852619 వాట్సాప్ నంబర్‌కు రుణమాఫీ కానీ రైతులు తమ వివరాలు పెడితే దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రుణమాఫీ కానీ రైతులకు సాయం అందిస్తామని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.


అసెంబ్లీలో బీఆర్ఎస్ పట్టుబట్టింది: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ (BRS MLA KP Vivekananda Goud) తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో వివేకానంద మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, రైతుభరోసాపై శాసనసభలో చర్చ జరపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు. తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్నా ఈ అంశాలపై చర్చకు అసెంబ్లీలో బీఆర్ఎస్ పట్టుబట్టిందని గుర్తుచేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్లే బడ్జెట్ గ్యాస్, ట్రాష్ అన్నది తేలిపోయిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఎద్దేవా చేశారు.


దేవుళ్లను కూడా సీఎం రేవంత్ మోసం చేశారు..

రాష్ట్రంలోని అన్ని ఆలయాల మీద ఒట్లు పెట్టిన రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు.తన నియోజకవర్గంలోని బౌరంపేట పీఏసీఎస్‌లో  632 మంది రైతులు రుణాలు తీసుకుంటే మొదట విడత 11 మందికి, రెండో విడతలో ముగ్గురికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు. కరెంటు కోతల మీద శాసనసభలో అడిగితే తిట్ల పురాణం అందుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పవిత్రమైన శాసనసభను అప్రదిష్టపాలు చేశారని ఆక్షేపించారు. ఒక శాసనసభ్యుడు అసభ్య వ్యాఖ్యలు చేస్తే దానిని సీఎం సమర్ధించడం సిగ్గుచేటని అన్నారు. రైతుభరోసా, రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివమని ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Nagarjunasagar: నాగార్జునసాగర్ 13, 14 గేట్లు ఎత్తివేత

KTR: ‘యథా రాజా తథా ప్రజా’.. దళిత మహిళపై దాడిని ఖండించిన కేటీఆర్

Jagadish Reddy: పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వట్లేదు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2024 | 04:07 PM

Advertising
Advertising
<