Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ముద్దాయిగా చేర్చాలి..
ABN , Publish Date - Mar 27 , 2024 | 11:34 AM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చేర్చాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్ కూడా ట్యాప్ చేసి తన ప్రచార తీరు తెన్నులను తెలుసుకుని...
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో మొదటి ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)ను చేర్చాలని బీజేపీ (BJP) మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్ కూడా ట్యాప్ చేసి తన ప్రచార తీరు తెన్నులను తెలుసుకుని ఇబ్బందులకు గురి చేశారని ఆయన ధ్వజమెత్తారు. దానికి సంబంధించి రెండో ముద్దాయిగా మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao), మూడో ముద్దాయిగా అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి (Venkatramireddy)ని చేర్చాలని డిమాండ్ చేశారు. వారితోపాటు అప్పటి డీజీపీ (DGP)ని కూడా ముద్దాయిగా చేర్చాలని రఘునందన్‌రావు అన్నారు.