ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Politics: బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను రెచ్చగొడుతున్నారు: ప్రీతం

ABN, Publish Date - Jul 10 , 2024 | 05:20 PM

బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం (Nagarigari Preetham) అన్నారు. బీఆర్ఎస్ నేతలు గాదరి కిశోర్, బాల్క సుమన్ పరుశ పదజాలంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Preetham Nagarigari

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం (Nagarigari Preetham) అన్నారు. బీఆర్ఎస్ నేతలు గాదరి కిశోర్, బాల్క సుమన్ పరుశ పదజాలంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్కనాడు కూడా జాబ్ క్యాలెండర్‌ను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. తాము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. గత పదేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు వేయలేదని నిలదీశారు.


ఈరోజు(బుధవారం) గాంధీభవన్‌లో మీడియాతో ప్రీతం మాట్లాడుతూ.. ఇపుడు తాము నోటిఫికేషన్ వేస్తే బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి మీద పరుషంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ సిగ్గు లేకుండా దళితులను ముందు పెట్టి మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఎంగిలి మెతుకుల కోసం కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగుల గురించి మాట్లాడటానికి బీఆర్ఎస్‌కి నైతిక అర్హత లేదని చెప్పారు.రేవంత్ వచ్చాక నిరుద్యోగులకు స్వేచ్ఛ వచ్చిందన్నారు.


ధర్నాలు చేస్తున్న వాళ్లు కనీసం ఉద్యోగం కోసం దరఖాస్తు కూడా చేయలేదని అన్నారు. డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాగే చేస్తే బట్టలూడదీసి ఉరికేయాల్సి వస్తదని హెచ్చరించారు. తన పదవి, రాజకీయం వదిలి నీ ముందుకు వస్తానని సవాల్ విసిరారు. ‘బరిగే పడతాం, మీ ముందుకు వస్తాం. దొర దగ్గరే ఉండాలా? ఉద్యోగాలు రావద్దా? ఉద్యోగాలు వస్తున్నాయి అంటే మీకు కడుపులో మంట’ అని ప్రీతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 10 , 2024 | 05:21 PM

Advertising
Advertising
<