ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raghunandan Rao: గెస్ట్ లెక్చర్లను విధుల్లోకి తీసుకోవాలి

ABN, Publish Date - Sep 06 , 2024 | 10:21 PM

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల గురుకులాల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్స్ రోడ్డు మీద పడ్డారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్ కలెక్టరేట్‎లో ఈరోజు(శుక్రవారం) దిశా కమిటీ మీటింగ్ జరిగింది.

మెదక్: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల గురుకులాల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్స్ రోడ్డు మీద పడ్డారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్ కలెక్టరేట్‎లో ఈరోజు(శుక్రవారం) దిశా కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... గెస్ట్ లెక్చరర్లను విధులకు హాజరు కావద్దని ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందని రఘునందన్ రావు గుర్తుచేశారు.


అర్థం పర్థం లేకుండా ప్రభుత్వం పనిచేస్తుందని అనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. విద్యా సంవత్సరం మధ్యలో గెస్ట్ లెక్చరర్లను తొలగిస్తే వారు వేరే పాఠశాలలో జాయిన్ కావడానికి అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం 6,200 మందిని ఎందుకు విధుల నుంచి తీసి వేసి రోడ్డు మీద పడేసిందని ప్రశ్నించారు. ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల విషయంలో పునరాలోచించాలని కోరారు. ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు వాళ్లకు వేతనాలు ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.


6,200 గురుకులాల్లో పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల తరఫున బీజేపీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యవర్తిత్వం వహిస్తే ఉక్రెయిన్‎తో శాంతి చర్చలు జరిపించడానికి రష్యా ఆసక్తిగా ఉందని చెప్పారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని ప్రజాస్వామ్యం అర్థం తెలియని వ్యక్తులు నరేంద్ర మోదీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మెదక్ మెడికల్ కాలేజ్ నివేదిక జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నివేదిక తీసుకుని త్వరలోనే కేంద్ర ప్రభుత్వ హెల్త్ సెక్రటరీని కలిసి వచ్చేలా చూస్తానని తెలిపారు. మెడికల్ కాలేజీ ఇవ్వాలని కేంద్రం దగ్గరికి వెళ్లి అప్పీల్ చేస్తానని రఘునందన్ రావు వెల్లడించారు.

Updated Date - Sep 06 , 2024 | 10:25 PM

Advertising
Advertising