Raghunandan Rao: రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం
ABN, Publish Date - Sep 30 , 2024 | 02:31 PM
కేసీఆర్ అవినీతి లక్ష కోట్లను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కక్కిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారని.. కానీ ఇప్పుడు సిట్టింగ్ జడ్జి దొరకలేదా? రిటైర్ అయిన జడ్జితో సిట్ వేశారని ఎద్దేవా చేశారు. రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు.
హైదరాబాద్: కేసీఆర్ పదేళ్ల పాటు చాలా హామిలు ఇచ్చి రైతులను మోసం చేశారని.. దీంతో ఎందరో అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. చనిపోయిన రైతు కుటుంబాలను కనీసం పరామర్శించని బీఆర్ఎస్ నేతలు ఇవ్వాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు భూసార పరీక్షలు చేయలేదని చెప్పారు.
ALSO READ: KTR: పంచాయతీల్లో పాలన గాడి తప్పింది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విసుర్లు
నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ అదే విధానాన్ని అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇవాళ(సోమవారం) ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష జరిగింది. ఈ దీక్షలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.
ALSO READ: Harish Rao: హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు.. హరీష్‌రావు ధ్వజం
పంట నష్టపోతే ఆదుకునేందుకు ఫసల్ బీమాను కేంద్రం తీసుకువస్తే.. కేసీఆర్ ఎందుకు తెలంగాణలో అమలు చేయనివ్వలేదని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఎంత అపఖ్యాతి మూటగట్టుకుందో.. 10 నెలల్లో కాంగ్రెస్ అంత మూట గట్టుకుందని విమర్శించారు. కేసీఆర్.. ఫామ్ హౌస్‌ను జాతికి అంకితం చేస్తావా? ఏం చేస్తావో తెలియదని అన్నారు. రైతులకు న్యాయం చేయాలని అన్నారు.
ALSO READ: KTR: పంచాయతీల్లో పాలన గాడి తప్పింది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విసుర్లు
కేసీఆర్ అవినీతి లక్ష కోట్లను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కక్కిస్తామని హెచ్చరించారు. నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారని.. కానీ ఇప్పుడు సిట్టింగ్ జడ్జి దొరకలేదా? రిటైర్ అయిన జడ్జితో సిట్ వేశారని ఎద్దేవా చేశారు. రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. తెలంగాణలో రైతుల సమస్యలు తీర్చడం బీజేపీకే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ ఒక 420 అనే విషయం అందరికీ తెలుసునని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao: 1962 సేవల పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఫైర్
ED: ఈడీ అదుపులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 30 , 2024 | 02:33 PM