ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajagopal Reddy: వారిద్దరిని జైలుకు పంపడమే నా లక్ష్యం.. రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jul 12 , 2024 | 07:44 PM

తన ఏకైక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం మాజీ సీఎం కేసీఆర్‌ని జైలు పంపడమేనని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సమాధి అయ్యిందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ - బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని ఆరోపించారు.

Rajagopal Reddy

హైదరాబాద్: తన ఏకైక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం మాజీ సీఎం కేసీఆర్‌ని జైలు పంపడమేనని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సమాధి అయ్యిందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ - బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు.


గాంధీభవన్‌లో ఈరోజు(శుక్రవారం) రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌లో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని.. బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ ఉండరని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలోకి పోతారని విమర్శించారు. జగదీశ్ రెడ్డిని తాము చేర్చుకోమని ఆయన జైలుకు పోయే వ్యక్తి అన్నారు. జైల్‌కి పోయే వ్యక్తులను తాము పార్టీలో చేర్చుకోమని తేల్చిచెప్పారు. కురియన్ కమిటీని కలిశానని పార్లమెంట్ ఎన్నికలు ఏవిధంగా జరిగాయని తనను కమిటీ అడిగిందని చెప్పారు. భువనగిరి ఇన్‌చార్జిగా మెజార్టీతో గెలిపించానని కమిటీకి చెప్పానని అన్నారు. భువనగిరిలో బీజేపీ గెలుస్తుందని టాక్ ఉంది కానీ తాను ఇన్‌చార్జ్ గా వెళ్లాక పరిస్థితులు మారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని గుర్తుచేశారు.ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక అభ్యర్థి కలిసి కట్టుగా పని చేశామన్నారు. రెండు లక్షల మెజార్టీ వచ్చిందని కమిటీకి చెప్పానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

Updated Date - Jul 12 , 2024 | 07:44 PM

Advertising
Advertising
<