Share News

Ramoji Rao: రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన రాజ్‌నాథ్‌సింగ్‌, మల్లికార్జున ఖర్గే

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:38 AM

రామోజీరావు(Ramoji Rao) మృతి పట్ల భాజపా, కాంగ్రెస్ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ (Rajnath Singh), మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంతాపం ప్రకటించారు. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

Ramoji Rao: రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన రాజ్‌నాథ్‌సింగ్‌,  మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్: రామోజీరావు(Ramoji Rao) మృతి పట్ల భాజపా, కాంగ్రెస్ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్‌(Rajnath Singh), మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంతాపం ప్రకటించారు. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. మీడియా, చలనచిత్రాల రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. సినీ నిర్మాతగా, మీడియా సంస్థల అధినేతగా, విద్యావేత్తగా రామోజీరావు అనేక సేవలు అందించారని, ఆయన మరణం విచారకరమన్నారు. మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దూరదృష్టి గల వ్యక్తి రామోజీరావు అని అన్నారు. సినిమా, పాత్రికేయ రంగానికి విశేష కృషి చేశారని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఖర్గే ప్రకటించారు.


మరోవైపు అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశాలకు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ్నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశాలు పంపించారు.

ఇవి కూడా చదవండి:

Ramoji Rao: రామోజీ రావు మృతి పట్ల కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ సంతాపం..

Ramoji Rao: రామోజీరావు మృతి ఆవేదన కలిగించింది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి..

Updated Date - Jun 08 , 2024 | 11:41 AM