Ranganath: కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టవద్దు
ABN, Publish Date - Sep 29 , 2024 | 10:19 PM
కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టవద్దు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. వాటికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్: కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టవద్దు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. వాటికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈరోజు రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డిలో హోంగార్డు గాయపడి చనిపోతే... హైడ్రా బలి తీసుకుందనడం సరికాదని అన్నారు. సంగారెడ్డి కూల్చివేతల్లో హోంగార్డ్ చనిపోయింది హైడ్రా వల్ల కాదని రంగనాథ్ చెప్పారు.
మరోవైపు... మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు రేపు(సోమవారం) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. రేపు 4గంటలకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్ గూడలో పర్యటించనున్నారు. అనంతరం అత్తాపూర్‌లోని కిషన్ బాగ్ ప్రాంతాల్లోని మూసీ ప్రాజెక్ట్‌లతో నష్టపోతున్న ప్రజలను కలవనున్నారు.
Updated Date - Sep 29 , 2024 | 10:19 PM