ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG High Court: జంపింగ్ జంపాగ్‌లకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు సంచలన తీర్పు

ABN, Publish Date - Nov 22 , 2024 | 11:21 AM

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేసింది.

హైదరాబాద్: జంపింగ్ జంపాగ్‌లకు తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) బిగ్ రిలీఫ్ లభించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిల్ దాఖలైంది. బీఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా అదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు.


పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా టైం ఫ్రెమ్ ఫిక్స్ చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం వినోద్ కుమార్‌కు సింగిల్ బెంచ్ ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. అసెంబ్లీ కార్యదర్శి రిట్ అప్పీల్‌పై హై కోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంజ్ స్పష్టం చేసింది. స్పీకర్‌కు ఏలాంటి టైం బాండ్ లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేవేసింది.


సీజే ధర్మాసనం తీర్పులో కీలక అంశాలు..

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సీజే ధర్మాసనం సూచించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టివేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 10వ షెడ్యూల్, అసెంబ్లీ ఐదేళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేసింది.


ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేసింది.


స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవడంలేదని. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు.


కాగా బీఆర్ఎస్​ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారని.. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కూకట్​పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్​ శాసన సభ్యులు పాడి కౌశిక్​ రెడ్డిలు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Nov 22 , 2024 | 11:35 AM