ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shabbir Ali: అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు.. షబ్బీర్ అలీ ధ్వజం

ABN, Publish Date - Dec 06 , 2024 | 08:17 PM

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియేట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తూ విగ్రహాన్ని పెట్టిస్తున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.

కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 54000 ఉద్యోగాలు ఇచ్చారని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. గ్రూప్ పరీక్షల పేపర్ లిక్ కాకుండా తమ ప్రభుత్వంలో అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ(శుక్రవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.27 కోట్లు మంజూరు చేసినట్లు షబ్బీర్ అలీ తెలిపారు.


మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రెచ్చ గొడుతున్నా ధాన్యానికి మద్దతు ధర ఉందని రైతులు ఎక్కడ కూడా ధర్నాకు దిగలేదని అన్నారు. ‘‘కవితా.. నీకు మీ నాన్నకు దోచుకోవడమే తెలుసు. తెలంగాణ రాగానే నీకు మీ అన్నకు , మీ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి’’ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియేట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తూ విగ్రహాన్ని పెట్టిస్తున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.


కేటీఆర్ ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారు: మహేష్ గౌడ్

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితే తెలంగాణ తల్లి అయింది. తాము పెడితే కాంగ్రెస్ తల్లి అవుతుందా అని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్ రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పండగను చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న పండగలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలను తాము సంవత్సరంలో ఇచ్చామని అన్నారు. తెలంగాణలో నిర్బంధం లేని పాలన నడుస్తోందని మహేష్ గౌడ్ అన్నారు.


మాజీ మంత్రి కేటీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కేటీఆర్ ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని నటించిన హరీష్ రావు ఏం త్యాగం చేశారని ప్రశ్నించారు. హరీష్ రావుపై చీటింగ్ కేసులు బుక్ అవుతున్నాయన్నారు. తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకుంది కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో నిర్బంధాలు లేవని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన భాషపై కేసీఆర్ మందలించాలని మహేష్ గౌడ్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Congress: అస్థిరత నుంచి సుస్థిరత దాకా

CM Revanth Reddy: కేసీఆర్‌! ప్రతిపక్ష నేతగా.. నీ డ్యూటీ చెయ్‌

KTR: రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా.. కాంగ్రెస్ తల్లినా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 08:49 PM