Share News

Phone Tapping Case: ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు

ABN , Publish Date - Mar 21 , 2024 | 02:48 PM

Telangana: ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కస్టడీలో భాగంగా ఐదవ రోజు ప్రణీత్‌ను పోలీసులు విచారించగా... పలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్‌ఐబీకి ప్రైవేట్ సైన్యంలా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ పనిచేసినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ కనుసన్నలో ప్రణీత్ రావు నడిచినట్లు విచారణలో తేలింది. 50 మంది అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న ప్రణీతరావు.. మూడు షిఫ్టుల్లోనూ అధికారులను ఉపయోగించి టాపింగ్‌కు పాల్పడ్డాడు.

Phone Tapping Case: ప్రణీత్ రావు కేసులో  కీలక మలుపు

హైదరాబాద్, మార్చి 21: ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Former SIB DSP Praneet Rao) కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కస్టడీలో భాగంగా ఐదవ రోజు ప్రణీత్‌ను పోలీసులు విచారించగా... పలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్‌ఐబీకి ప్రైవేట్ సైన్యంలా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ పనిచేసినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ కనుసన్నలో ప్రణీత్ రావు నడిచినట్లు విచారణలో తేలింది. 50 మంది అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న ప్రణీతరావు.. మూడు షిఫ్టుల్లోనూ అధికారులను ఉపయోగించి టాపింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో ప్రణీత్ రావు ప్రైవేట్ సైన్యంలో పనిచేసిన అధికారులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Loksabha Elections: వాట్సాప్‌లో వికసిత్ భారత్ మెసేజ్‌లు ఆపండి, కేంద్రానికి ఈసీ ఆదేశం


ఎస్‌ఐబీ చీఫ్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రణీత్ ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు విచారణలో బయటపడింది. నిషేధిత మావోయిస్టు, టెర్రరిస్టుల ఫోన్‌పై నిఘా పెట్టాల్సిన వింగ్ ప్రైయివేట్ వ్యక్తుల ఫోన్స్ ట్యాపింగ్ చేసినట్లు తేలింది. ఎస్‌ఐబీలో సొంత సామ్రాజ్యన్ని ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. అతడికి సహకరించిన అధికారులను కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఇన్స్‌పెక్టర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

YS Sharmila: జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా?


హైకోర్టులో పిటిషన్‌పై...

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిగింది. నిన్న ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈరోజు ప్రణీత్‌ రావు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ప్రణీత్ రావ్ కస్టడీపై కింది కోర్టు ఇచ్చిన కస్టడీ అనుమతి సరైందే అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి...

Odisha: బీజేపీ-బీజేడీ పొత్తు పొడుస్తుందా.. 15 ఏళ్ల చరిత్ర రిపీట్ కానుందా

Chandrababu: 99 శాతం హామీల అమలంటున్న జగన్ మాటలు బూటకం


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 21 , 2024 | 03:15 PM