Talasani Srinivas Yadav: కేటీఆర్‌పై కావాలనే రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది
ABN, Publish Date - Oct 27 , 2024 | 07:20 PM
సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం పోలీసులు చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. దీని వెనుక బలమైన కుట్రకోణం ఉందన్నారు. రాష్ట్రంలో సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలని అన్నారు. ఫామ్‌హౌస్‌కు సొంత ఇంటికి సంబంధం ఏంటని అడిగారు.
హైదరాబాద్: తెలంగాణలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజ్ పాకాల సొంత ఇంటిని కట్టుకుని గృహ ప్రవేశం చేసుకున్నారని తెలిపారు. ఇవాళ (ఆదివారం) తెలంగాణ భవన్‌లో తలసాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అందుకే కేటీఆర్‌ను టార్గెట్ చేసి రచ్చ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ఫిర్యాదు చేసింది ఎవరని ప్రశ్నించారు. వారు ఇచ్చిన రిపోర్ట్‌లో నాలుగు బాటిల్స్ ఎక్కువ ఉన్నాయని అన్నారు.
ఆబ్కారీ, పోలీసు అధికారులు పంచనామా చేసి నాలుగు బాటిల్స్ ఉన్నాయని చెప్పారని అన్నారు. వ్యక్తిని, వ్యక్తి కుటుంబాన్ని టార్గెట్ చేయడం రాజకీయాల్లో మంచి పద్ధతి కాదని అన్నారు. జన్వడ ఫామ్‌హౌస్ ఎక్కడ ఉంది రాజ్ పాకాల ఇల్లు ఎక్కడ ఉందని నిలదీశారు. గేటెడ్ కమ్యూనిటీలో చాలామంది ఉంటారని చెప్పారు.కుట్రతోనే పోలీసులు సోదాలు అంటున్నారని అన్నారు. కేటీఆర్ బావమరిది కాబట్టే బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని అన్నారు. వ్యక్తిగత కక్షలు రాజకీయాల్లో చూస్తున్నామని చెప్పారు. రాజకీయ పార్టీపైన, కుటుంబం పైన బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం పోలీసులు చేశారని మండిపడ్డారు. దీని వెనుక బలమైన కుట్రకోణం ఉందన్నారు. రాష్ట్రంలో సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలని అన్నారు. ఫామ్‌హౌస్‌కు సొంత ఇంటికి సంబంధం ఏంటని అడిగారు. కేటీఆర్‌పై కావాలనే రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: మూసీకి పునరుజ్జీవం కల్పిద్దాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Kishan Reddy: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Bhatti Vikramarka: మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుంది
Rave party: కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..
AV Ranganath: అనుమతులుంటే కూల్చం
KTR: ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో’.. కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..
Read Latest Telangana News and Telugu News
Updated Date - Oct 27 , 2024 | 08:27 PM