Telangana Assembly 2024 LIVE: హాట్ హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
ABN , First Publish Date - Dec 17 , 2024 | 10:53 AM
Telangana Assembly 2024 Live Updates in Telugu: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమవడమే ఆలస్యం.. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
Live News & Update
-
2024-12-17T15:52:53+05:30
టూరిజం పాలసీ పై చర్చ పూర్తి
అసెంబ్లీ బుధవారానికి వాయిదా
అసెంబ్లీ రేపు ఉదయం 10గంలకు వాయిదా
-
2024-12-17T15:29:02+05:30
GST చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
చర్చ లేకుండానే బిల్లులకు ఆమోదం..
-
2024-12-17T15:27:39+05:30
తెలంగాణ టూరిజం పాలసీ పై అసెంబ్లీలో చర్చను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
బిఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్యే చర్చను కొనసాగిస్తున్న మంత్రి
-
2024-12-17T15:21:09+05:30
బీఆర్ఎస్ కీలక సమావేశం..
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌పై బీఆర్ఎస్ ఫోకస్.
తెలంగాణ భవన్ లో 4.30గంలకు కొండగల్ బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కేటీఆర్ సమావేశం.
లగచర్ల ఘటనలో జైల్లో ఉన్న కొండగల్ బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి.
-
2024-12-17T15:19:57+05:30
యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్..
స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
-
2024-12-17T15:19:38+05:30
రైతుకు బేడీల అంశంపై BRS నేతలకు మాట్లాడే అర్హత లేదు..
BRS హయాంలో రైతులకు కనీసం పదిసార్లు బేడీలు వేశారు..
అప్పుడు అధికారులపై కనీసం చర్యలు లేవు: మంత్రి సీతక్క
రైతుకు బేడీలు వేసిన అంశంపై..
సీఎం రేవంత్ చర్యలు కూడా తీసుకున్నారు: మంత్రి సీతక్క
బీఆర్‌ఎస్ సభ్యుల వ్యవహారశైలి దారుణం: మంత్రి సీతక్క
-
2024-12-17T15:17:54+05:30
కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుపై చర్చ
లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్‌ఎస్ పట్టు
సభలో నినాదాలు చేస్తున్న బీఆర్‌ఎస్ సభ్యులు
లగచర్ల రైతులను విడుదల చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్
BRS సభ్యుల నినాదాల మధ్యే కొనసాగుతున్న అసెంబ్లీ
-
2024-12-17T15:17:18+05:30
తెలంగాణ శాసనమండలిలో ప్లకార్డులతో BRS సభ్యుల నిరసన
లగచర్ల రైతులను విడుదల చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్
బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనల మధ్య మండలి రేపటికి వాయిదా
శాసనమండలి ప్రవేశ ద్వారం వద్ద BRS ఎమ్మెల్సీల ధర్నా
-
2024-12-17T15:16:57+05:30
మూసీ ప్రాంత ప్రజల ఆస్తి నష్టం జరిగితే ఊరుకోం: ఎమ్మెల్సీ కవిత
ప్రభుత్వం కనీస కనికరం లేకుండా ప్రజలపైకి బుల్డోజర్లు పంపుతోంది..
మూసీ ప్రాజెక్టుపై ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది: కవిత
ప్రపంచ బ్యాంకు నుంచి ప్రభుత్వం రూ.4,100 కోట్ల రుణం కోరింది..
డీపీఆర్ లేకుండా వరల్డ్ బ్యాంకు రుణం ఎలా ఇస్తుంది?: MLC కవిత
మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు: MLC కవిత
-
2024-12-17T15:16:32+05:30
కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది: సీతక్క
నిరసనల్లోనూ బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు: సీతక్క
రైతుకు బేడీల అంశంపై BRS నేతలకు మాట్లాడే అర్హత లేదు..
BRS హయాంలో రైతులకు కనీసం పదిసార్లు బేడీలు వేశారు..
అప్పుడు అధికారులపై కనీసం చర్యలు లేవు: మంత్రి సీతక్క
రైతుకు బేడీలు వేసిన అంశంపై..
సీఎం రేవంత్ చర్యలు కూడా తీసుకున్నారు: మంత్రి సీతక్క
-
2024-12-17T13:42:49+05:30
శాసనమండలి: మూసీ విషయంలో డీపీఆర్ ఆధారంగా.. అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది: కవిత
రూ.4100 కోట్ల కోసం వరల్డ్ బ్యాంక్‌ను ప్రభుత్వ ఆశ్రయించింది.
వరల్డ్ బ్యాంక్‌ను ఆశ్రయించిన విషయం వాస్తవమా.. కాదా?: కవిత
డీపీఆర్ సిద్ధం కాలేదని ప్రభుత్వం ఇవాళ సభకు చెప్పింది: కవిత
ఏ తేదీన వరల్డ్ బ్యాంక్‌కు ప్రతిపాదనలు పంపారు: ఎమ్మెల్సీ కవిత
మూసీకి రూ.14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు..
అనుమతులు ఇప్పించాలని కిషన్‌రెడ్డిని ఏ ప్రాతిపదికన రేవంత్ కోరారు.
కేంద్రాన్ని, వరల్డ్ బ్యాంక్‌ను సాయం కోరడం వాస్తవమైతే..
సభను, ప్రజలను ఎందుకు తప్పదోవపట్టిస్తున్నారు?: ఎమ్మెల్సీ కవిత
సభను తప్పదోవ పట్టిస్తే.. ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతాం: కవిత
-
2024-12-17T11:45:03+05:30
భట్టి అప్పుల లెక్క చెబుతున్నారు.. మరీ ఆస్తుల లెక్క ఏది?: హరీష్‌రావు
తెలంగాణ ఏర్పాటు నాటి నుంచి నేటి వరకు..
మన బడ్జెట్ ఎంత పెరిగిందో తెలుసుకోవాలి: హరీష్‌రావు
బడ్జెట్ పది రెట్లు పెరిగింది.. దానికి బీఆర్ఎస్సే కారణం: హరీష్‌రావు
-
2024-12-17T11:27:12+05:30
అప్పులు చేయలేదు.. చేయం: భట్టి
ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి మేం అప్పు చేయలేదు. చేయం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వీలైనంత త్వరగా అప్పులు తగ్గించుకుంటాం.
పదేళ్ల విధ్వంసం వల్ల ఆర్ధిక భారం ఎక్కువ ఉంది.
ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాం.
ఔటర్ ను 30 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుంది.
పన్నులు వచ్చే రోడ్లను బీఆర్ఎస్ తనఖా పెట్టింది.
-
2024-12-17T10:58:39+05:30
బీఆర్ఎస్ నీతులు మాట్లాడటం ఏంటి: భట్టి
ఆర్థిక విధ్వంసం చేసిన బీఆర్ఎస్ నేతలు నీతులు మాట్లాడడం ఏంటి?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులు పెండింగ్ లో పెట్టింది బీఆర్ఎస్.
40 వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది.
ప్రతి గింజా మేమే కొంటామని సివిల్ సప్లయ్ లో 18 వేల కోట్ల బకాయిలు పెట్టారు.
-
2024-12-17T10:55:50+05:30
Telangana Assembly: అప్పులపై చర్చకు సిద్ధం..
తాము ఇచ్చిన ప్రొవిలేజ్ మోషన్ అనుమతించాలని సభలో కోరిన హరీష్ రావు
ఇప్పటికిప్పుడు అప్పులపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన హరీష్ రావు
సమావేశాలు ముగిసేలోపైనా అప్పులపై చర్చించాలని పట్టుబడ్డిన హరీష్ రావు
ప్రభుత్వం చెప్తున్న అప్పులకు, వాస్తవ అప్పులకు తేడా ఉందన్న హరీష్
-
2024-12-17T10:53:48+05:30
తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు.
FRBM రుణాలపై అసెంబ్లీలో మాటల యుద్ధం.
2024 నవంబర్ వరకు.. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.51,200కోట్లు: భట్టి
భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై హరీష్‌రావు అభ్యంతరం
రాష్ట్రానికి రూ.7లక్షల కోట్ల అప్పు ఉందనేది అవాస్తవం: హరీష్‌రావు
రూ.51వేల కోట్ల అప్పు చేశామని ఒప్పుకున్నారు: హరీష్‌రావు
ఇవాళ మరో రూ.3వేల కోట్ల అప్పు తీసుకున్నారు: హరీష్‌రావు
ఒక్క ఏడాదిలో లక్షా 27వేల కోట్ల అప్పులు చేశారు: హరీష్‌రావు
బీఆర్ఎస్ హయాంలో రూ.4లక్షల కోట్ల అప్పులు చేశాం: హరీష్‌రావు
సభను బీఆర్ఎస్ తప్పువదోవ పట్టిస్తోంది: భట్టి విక్రమార్క
అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశాం: భట్టి
అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?: భట్టి
భట్టి సవాల్‌ను స్వీకరిస్తున్నాం.. అప్పులపై చర్చకు సిద్ధం: హరీష్‌రావు