Speaker Prasad Kumar: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎక్స్ అకౌంట్ హ్యాక్..
ABN, Publish Date - Aug 26 , 2024 | 12:14 PM
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar)కు భారీ షాక్ తగిలింది. ఇవాళ(సోమవారం) ఉదయం ఆయన ఎక్స్(X) ఖాతాను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఆ సమయంలో కొన్ని అసభ్యకర వీడియోలను పోస్టు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar)కు భారీ షాక్ తగిలింది. ఇవాళ(సోమవారం) ఉదయం ఆయన ఎక్స్(X) ఖాతాను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఆ సమయంలో కొన్ని అసభ్యకర వీడియోలను పోస్టు చేశారు. అకౌంట్ రికవరీ తర్వాత స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.." ఇవాళ ఉదయం నా వ్యక్తిగత X (Twitter) అకౌంట్ కొంత సమయం హ్యాక్ అయ్యింది. ఆ సమయంలో కేటుగాళ్లు కొన్ని అసభ్యకర వీడియోలు పోస్టు చేశారు. మా టెక్నికల్ టీమ్ ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకున్నారు. వెంటనే ఖాతాను తిరిగి రికవరీ చేశారు. హ్యాక్ చేసిన సమయంలో దుండగులు అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టారు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు" అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: తెలంగాణ సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం.. ఎందుకంటే?
Hydra: దడ పుట్టిస్తున్న హైడ్రా నాన్‌స్టాప్ కూల్చివేతలు..
Road Accident: బేగంపేట్ మెట్రోస్టేషన్ వద్ద ఘోర ప్రమాదం, యువతి మృతి..
KTR: కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి: కేటీఆర్..
Updated Date - Aug 26 , 2024 | 01:32 PM