ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:32 PM

ఉప్పల్ భగాయత్‌లో సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్: ఉప్పల్ భగాయత్‌ (Uppal Bhagayath)లో సౌకర్యాల కొరతపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN AndhraJyoty) ప్రచురించిన వరస కథనాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఉప్పల్ భగాయత్‌లో సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎచ్ఎమ్‌డీఏ అధికారుల్లో చలనం వచ్చింది. గత ప్రభుత్వం హయాంలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్లాట్లు వేసి హెచ్ఎమ్‌డీఏ విక్రయాలు చేసింది. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అక్కడ నివసిస్తున్న వెయ్యికి పైగా కుటుంబాలు ఏళ్లుగా నానావస్థలు పడుతున్నారు.


సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ, వార్తాపత్రిక, వెబ్ సైట్‌లో వరస కథనాలు ప్రచురించింది. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా చేసింది. దీంతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎచ్ఎమ్‌డీఏ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ సర్కార్ ఉన్నతాధికారులను ఆదేశించింది. 200 మంది పారిశుద్ధ్య సిబ్బందితో ఉప్పల్ భగాయత్‌లో చెత్తాచెదారం తొలగించాలని, రోడ్ల మరమ్మతు, వీధి లైట్ల సమస్య సహా పలు సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఉప్పల్ భగాయత్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Group-1: గ్రూప్-1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

గద్దర్‌పై మహా పరిశోధన

Kishan Reddy: ముందు మూసీకి రిటైనింగ్‌ వాల్‌ కట్టండి

Train Schedule: ఆ రైళ్ల వేళలు మారాయ్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 20 , 2024 | 12:33 PM