TG News: 18న మంత్రి మండలి.. పునర్విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చ..!
ABN, Publish Date - May 17 , 2024 | 10:28 PM
ఈ నెల 18 వ తేదీన తెలంగాణ కేబినేట్ భేటీ కానున్నది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలు, ఉమ్మడి ఏపీతో పీట ముడిగా ఉన్న సమస్యలపై పరిష్కారం దిశగా ఈ భేటీలో చర్చించనున్నారు.వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల కొనుగోళ్లపై మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ఈ నెల 18 వ తేదీన తెలంగాణ కేబినేట్ భేటీ కానున్నది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలు, ఉమ్మడి ఏపీతో పీట ముడిగా ఉన్న సమస్యలపై పరిష్కారం దిశగా ఈ భేటీలో చర్చించనున్నారు.వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల కొనుగోళ్లపై మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న ఇబ్బందులు అజెండాగా ఈనెల 18న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరుగనున్నది. పదేళ్లు శాశ్వతంగా ఉన్న సమస్యలు పరిష్కరం దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయి నివేదికతో రావాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. షెడ్యూల్9, 10 ప్రకారం తెలంగాణ, ఏపీ కేటాయింపులు రెండు రాష్ట్రాల్లో సామరస్య పూర్వకంగా ఉన్నట్లు వంటి ఉద్యోగుల బదిలీ వంటి అంశాలు పూర్తి చేసేలా కేబినేట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని పీటమడిపై ఉన్న అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యచరణపై ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అంశాలపై మంత్రి మండలి ఓ నిర్ణయానికి రానుంది.
తెలంగాణ ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తవుతుండటంతో పునర్విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్నటువంటి హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మాత్రమే ఉన్నందున లేక్ ఫ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ 2వ తేదీ తర్వాత ఆధీనంలోకి తీసుకునే యోచన చేయనున్నది. పునర్విభజన చట్టప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలపై రెండు రాష్ట్రా ల మధ్య ఏకాభి ప్రాయంతో కూడిన నివేదికన అధికారులు సిద్ధం చేశారు. ఆర్టీసీ ఆస్తులు, ఏపీకి తెలంగాణ విద్యుత్ అంశాలపై మంత్రి మండలి చర్చించనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి....
BJP MLAs: వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలం..
Vijayashanti: కాంగ్రెస్‌లో ఉంటూనే బీఆర్‌ఎస్‌పై రాములమ్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్...
Rakesh Reddy: బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రశ్నించే గొంతును..
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 17 , 2024 | 10:37 PM