Telangana: ధరణి మార్గదర్శకాలు విడుదల.. కీలక బాధ్యతలన్నీ కలెక్టర్లకే..
ABN, Publish Date - Feb 29 , 2024 | 03:45 PM
తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్ఏ మార్గదర్శకాలు సూచించింది. మార్చి ఒకటి నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్ఏ మార్గదర్శకాలు సూచించింది. మార్చి ఒకటి నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 24వ తారీఖున ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన రివ్యూలో ధరణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ధరణి కమిటీ కొన్ని సూచనలు చేసింది. తహశీల్దార్, ఆర్టీవో, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల సమక్షంలో కమిటీలు పని చేస్తాయి. టైం లైన్ విధించి ఆ లోపు పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశించింది. కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్ లో భద్రపరచాలని సూచించింది.
ధరణి అడ్డం పెట్టుకొని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా ఉండి ఆగిపోయిన అప్లికేషన్లు, ఫొటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించాలి. అసైన్డ్ ల్యాండ్ ల సమస్యలు పరిష్కరించాలి. పాస్ బుక్ కరెక్షన్స్, పాస్ బుక్ లో మిస్ అయిన పేర్లు సర్వే నెంబర్లు, కాటా మర్జింగ్, ఒక మండల ఆఫీసులో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో కలిపి టీంలు ఏర్పాటు చేయాలి. పెండింగ్ అప్లికేషన్లను మోజుల వైస్ విభజించాలి. అభ్యర్థుల ఫోన్ నెంబర్ల ద్వారా వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వెంటనే చేరవేయాలి అని ఆదేశాల్లో పేర్కొంది.
అప్లికేషన్లను క్లియర్ చేసే ముందు ప్రభుత్వ రికార్డులో వాటి వివరాలను తప్పనిసరిగా చెక్ చేయాలని ప్రభుత్వం సూచించింది. అన్ని అప్లికేషన్స్ మార్చి ఒకటి నుంచి తొమ్మిది లోగానే క్లియర్ చేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు పరిష్కరించడం ధరణి సమస్యలపై రివ్యూ నిర్వహించి సీసీఎల్ఏకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 29 , 2024 | 03:45 PM