Minister Sridhar Babu: దొంగల బీభత్సం.. మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ
ABN, Publish Date - Nov 09 , 2024 | 01:24 PM
వరుసగా తెలంగాణలో చోరీలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ ఉండే రాజకీయ నాయకుల ఇంట్లోనే చోరీలు జరగడంతో సామాన్యల పరిస్థితి ఎంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈచోరీ విషయం స్థానికులకు తెలియడంతో వారు భయాభ్రాంతులకు గురవుతున్నారు. దొంగలను పట్టుకుని రక్షణ కల్పించాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు.
హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిశ్రీధర్ బాబు ఉంటున్నారు. దీపావళి రోజున సెల్‌ఫోన్ చోరీకి గురైనట్లు గుర్తించారు. కాగా ఈ సంఘటనపై వెంటనే శ్రీధర్ బాబు అలర్ట్ అయ్యారు. సెల్‌ఫోన్ చోరీపై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
మంత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి దగ్గరలో ఉండే సీసీ కెమెరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ చోరీ విషయం బయటకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మంత్రికే రక్షణ లేకపోతే తమ పరిస్థితి ఏంటని పోలీసులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే నెల రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరగడంతో చర్చనీయాంశంగా మారింది.
భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ..
కాగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కలకలం రేపింది. ఇంటి వాచ్‌మన్ తన స్నేహితుడితో కలసి దొంగతనానికి పాల్పడి పారిపోగా.. పశ్చిమ బెంగాల్లో వారిని పట్టుకున్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత మల్లు భట్టి విక్రమార్క కుటుంబం ప్రజాభవన్‌కు మారడంతో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14లోని ఆయన ఇల్లు ఖాళీగానే ఉంది. ఆ ఇంటి బాగోగులు చూసేందుకు రోషన్ మండల్ అనే వ్యక్తిని వాచ్‌మన్‌గా నియమించారు. ఈనెల 21న డిప్యూటీ సీఎం పీఎస్వో భాస్కర్‌శర్మ వాచ్‌మన్‌కు ఫోన్ చేయగా కలవలేదు. అనుమానంతో ఆయన కార్యాలయ సిబ్బందిని ఇంటికి పంపించగా రోషన్ కనిపించలేదు.
ఇటు ఇంటిలోపల పరిశీలించగా బెడ్ రూం తలుపులు పగులగొట్టి ఉండగా.. కప్‌బోర్డులో ఉండే రూ.80 వేలు విలువ చేసే వెండి వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసులు పరిశీలించారు. రోషన్మండల్ తన స్నేహితుడు ఉదయ్‌కుమార్ ఠాకూర్‌తో కలిసి చోరీ చేసి పశ్చిమ బెంగాల్‌కు పారిపోయినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అక్కడికెళ్లిన పోలీసులు.. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో నిందితులుండగా రైల్వే పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad: ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద అనుకోని ఘటన.. భయంతో జనం పరుగులు
Minister Narayana: జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ.. మంత్రి నారాయణ వార్నింగ్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 09 , 2024 | 01:36 PM