ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Thummala: బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు.. మంత్రి తుమ్మల విసుర్లు

ABN, Publish Date - Sep 23 , 2024 | 09:44 PM

రూ.2 లక్షలు పైన ఉన్న రైతులకు కూడా రుణమాఫీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులకు మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేశామని అన్నారు. భారతదేశంలో అత్యధికంగా తెలంగాణలో కోటీ 50 లక్షల మెట్రిక్ టన్నుల వరిని రైతులు పండిస్తున్నారని వెల్లడించారు. సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

Minister Thummala Nageswara Rao

ఖమ్మం జిల్లా; తెలంగాణలో తెల్లకార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేలకొండపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఇవాళ(సోమవారం) జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో భాగస్వామ్యం అయ్యారని చెప్పారు. పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 31 వేల కోట్ల రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.


ALSO READ: Congress: కమిటీల పేరుతో కాలయాపన చేశారు.. బీఆర్ఎస్‌పై మండిపడిన దామోదర

ముందుగా రూ. 2 లక్షల వరకే రుణమాఫీ ఇవ్వాలని అనుకున్నామని అన్నారు. రూ.2 లక్షలు పైన ఉన్న రైతులకు కూడా ఇవ్వాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతులు మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేశామని అన్నారు. భారతదేశంలో అత్యధికంగా తెలంగాణలో కోటీ 50 లక్షల మెట్రిక్ టన్నుల వరిని రైతులు పండిస్తున్నారని వెల్లడించారు. సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటిచ్చారు.


ALSO READ: Minister Ponguleti: గుడ్ న్యూస్.. మరో రెండ్రోజుల్లో వారి ఖాతాల్లో రూ.10వేలు..

ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుందని తెలిపారు. మార్కెట్ ధరలు తగ్గిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. మద్దులపల్లి మార్కెట్‌కు రూ. 20 కోట్లు అందజేశామని చెప్పారు. ఖమ్మం మార్కెట్‌తో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్లు అభివృద్ధి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాకు జాతీయ రహదారులు తీసుకొచ్చే భాగ్యం తనకు దక్కిందని చెప్పారు. ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు వస్తుందని తెలిపారు. ఖమ్మంను అన్ని రకాలుగా తీర్చిదిద్దే బాధ్యత తమ ప్రభుత్వానిదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టిందని.. తమ ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు.


5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని.. తమ ప్రభుత్వం అప్పులు తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేసిందని తెలిపారు. పిల్లలను చదివిచ్చుకుని పంటలను మంచిగా పండించుకుని ఆనందంగా ఉండాలని సూచించారు. ప్రజలు తలెత్తుకునే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. భారీ వర్షాల వల్ల గండ్లు పడ్డాయని.. వాటిని త్వరగా పూడ్చి వ్యవసాయ పొలాలకు నీళ్లు ఇవ్వాలని అధికారులకు చెప్పామని అన్నారు. రేపటి కల్లా రైతులకు నీళ్లు వస్తాయని తెలిపారు. నేలకొండపల్లిలో బౌద్ద స్తూపం అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రిని తీసుకువచ్చానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.


పాలేరు నియోజకవర్గంలో ఎక్కువగా పంటలు పండుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరులో ప్రతి ఎకరం సాగు అవుతుందని చెప్పారు. అవసరం అయిన చోట చెక్ డ్యామ్‌లు, బ్రిడ్జిలు కట్టామని అన్నారు. పాలేరు అత్యంత ఖరీదు కలిగిన నియోజకవర్గమని తెలిపారు. గతంలో పాలేరు ఒట్టిపోయిన నియోజకవర్గమని...ఇప్పుడు అభివృద్ధిలో ముందుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులు పామాయిల్ సాగుపై దృష్టి పెట్టాలని అన్నారు. పాలేరు నియోజకవర్గం పచ్చగా ఉండాలని... ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు. ఎకరానికి రూ. 52 వేలు సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు.పామాయిల్ ఎక్కువగా సాగు చేస్తే పాలేరులో కూడా పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టిస్తానని మాటిచ్చారు. కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.


భారీ వర్షాలపై కీలక ఆదేశాలు

భారీ వర్షాల కారణంగా అన్ని పంటల్లో చీడ, పీడ పురుగుల బెడద పెరుగుతుండటంతో వ్యవసాయ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తం చేశారు. వరిలో బ్యాక్టీరియా ఎండకుళ్లు తెగులు, ప్రత్తిలో రసంపీల్చే పురుగులు, మెగ్నీషియం లోపం ఉందని మంత్రి తెలిపారు. శాస్త్రవేత్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి చీడ, పీడ పురుగుల, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. వ్యవసాయశాఖ సిబ్బంది యూనివర్సిటి సిబ్బంది సంయుక్త బృందాలుగా ఏర్పడి రానున్న మూడు, నాలుగు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Harish: బీహార్‌‌లా తెలంగాణను మారుస్తున్నారు.. హరీష్ ఆగ్రహం

KTR: బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్

Beerla Ilaiah: హరీష్‌, కేటీఆర్‌లపై ప్రభుత్వ విప్ ఫైర్

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 23 , 2024 | 09:49 PM