ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: కవితకు బెయిల్ ఇప్పిస్తోంది కాంగ్రెస్సే.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..

ABN, Publish Date - Aug 20 , 2024 | 08:32 PM

Telangana: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ యే కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు.

Bandi Sanjay

Telangana: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ యే కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగానే అభిషేక్ సింఘ్వీకి తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ వేయించారని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. కేసీఆర్ చెబితేనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్లు, ప్రభత్వంలో మంత్రి పదవులిస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫాంహౌజ్ కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యనించారు.


మంగళవారం నాడు మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల గ్రామంలో నిర్వహించిన సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి.. రావిరాల సూర్యగిరి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని.. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు.


ఇదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పదేపదే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసుకోబోతున్నారంటూ దుష్ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు బండారం బయటపడిందన్నారు. కాంగ్రెస్ నేతలే కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీయే లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కవిత బెయిల్ కోసం కోర్టులో వాదిస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పారు.


‘అభిషేక్ సింఘ్వీ పెద్ద న్యాయవాది, అనుభవజ్జుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆయన తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి అవుతున్నాడంటే తెలంగాణ ప్రయోజనాల కోసం కోర్టులో, పార్లమెంట్‌లో గట్టిగా వాదిస్తారని అనుకున్నా. కానీ తీరా చూస్తే.. లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వాలని వాదిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి. ఇన్నాళ్ళు కేసీఆర్ కుటుంబ అవినీతిని బట్టబయలు చేస్తాం.. జైలుకు పంపిస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఆ కుటుంబాన్ని ఎందుకు జైలుకు పంపలేదు? ఎందుకంటే కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి కాబట్టి. అందుకే కాళేశ్వరం, డ్రగ్స్, మియాపూర్ భూములు, ఫోన్ ట్యాపింగ్ కేసులన్నీ అటకెక్కించారు. రెండు పార్టీలు ఒక్కటే. బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు కల్ల. బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీ. ఆ పార్టీతో పొత్తు ఉండదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి, కుటుంబ పార్టీలే. కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ విలీనం తధ్యం.’ అని బండి సంజయ్ అన్నారు.


అవినీతి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. ఈ కారణంగానే బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాము 6 గ్యారంటీలు, రుణమాఫీపై నిలదీస్తుంటే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజీవ్ గాంధీ విగ్రహం పేరుతో లొల్లి చేస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. సరైన సమయంలో సరైన గుణ పాఠం చెబుతారన్నారు. బీజేపీనే కవితకు బెయిల్ ఇప్పిస్తోందని చెప్పడం దుర్మార్గం అన్నారు. బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాదిరిగా కోర్టులో కవిత బెయిల్ కోసం వాదిస్తున్నామా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. బెయిల్ ఇచ్చేది కోర్టులు అని.. సుప్రీంకోర్టును ధిక్కరించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం సరికాదని వార్నింగ్ ఇచ్చారు.


హిందూ సమాజం ఏకం కావాలి..

ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల అంశంపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పందించిందన్నారు. హిందూ సమాజం జాగృతం కావాలని, జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్.


Also Read:

కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!

పోచారం, గుత్తా అమిత్‌లకు కీలక పదవులు

ఐఏఎస్ ఆమ్రపాలికి కీలక పదవి..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 20 , 2024 | 08:32 PM

Advertising
Advertising
<