TG Elections: కాంగ్రెస్ తప్పిదాల వల్లే నీటి ఇబ్బందులు.. జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్
ABN, Publish Date - Apr 19 , 2024 | 09:22 PM
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నీటి వనరుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. నల్గొండ దాహార్తిని , ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్ పాండ్ ఆధారాన్ని దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని మండిపడ్డారు.
సూర్యాపేట: కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నీటి వనరుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. నల్గొండ దాహార్తిని , ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్ పాండ్ ఆధారాన్ని దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ తప్పిదాల వల్లే నీటి ఇబ్బందులు వచ్చాయని అన్నారు. శుక్రవారం నాడు కృష్ణా టెయిల్ పాండ్ నీటి విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth: కేసీఆర్ కాలం చెల్లింది.. కారు షెడ్డుకు పోయింది.. సీఎం రేవంత్ వ్యంగ్యాస్త్రాలు
నల్గొండ జిల్లాను ఏడారిగా మార్చే కుట్ర జరుగుతోందని విరుచుకుపడ్డారు. గత 60 ఏళ్లు కృష్ణా జిల్లాల్లో మన హక్కులను కొట్లాడక జిల్లాను కరువు కొరల్లోకి నెట్టారని మండిపడ్డారు. హామీలకు మొసపోయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ప్రజలు ఓటేశారని.. కానీ ఈ ప్రభుత్వం మత్తునిద్రలో ఉందని విమర్శించారు. టెయిల్ పాండ్ నీటి చౌర్యానికి జిల్లా మంత్రులు, రేవంత్ రెడ్డి బాధ్యులు కాదా అని ప్రశ్నించారు.నీటి చౌర్యంపై విచారణ చేసి ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
TG Elections: బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలు.. జగ్గారెడ్డి విసుర్లు
కృష్ణా నీటి దోపిడీపై పల్లెలోకి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని అన్నారు. టెయిల్ పాండ్ నీటి విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతల మెడలు వంచాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రేవంత్ ప్రభుత్వాన్ని 6 గ్యారెంటీలు అమలు చేసేలా పోరాడుతామని జగదీష్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి
TS Politics: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?
Congress: రైతుల రుణమాఫీ ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం
Raghunandan rao: హరీష్‌రావు ఆ గట్టునుంటారో?.. ఈ గట్టునుంటారో?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 19 , 2024 | 09:24 PM