ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politics: టీమ్‌గా మంత్రులు, కెప్టెన్ అతనే.. జగ్గారెడ్డి సంచలనం

ABN, Publish Date - May 23 , 2024 | 02:53 PM

తెలంగాణ మంత్రులు అంతా కలసి కట్టుగా ఉన్నారని, నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మా కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి అని తేల్చి చెప్పారు. రేవంత్ నేతృత్వంలో గల టీమ్ ప్రజల కోసం పనిచేస్తుందని జగ్గారెడ్డి వివరించారు.

jagga reddy

హైదరాబాద్: తెలంగాణ మంత్రులు అంతా కలసి కట్టుగా ఉన్నారని, నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) స్పష్టం చేశారు. తమ కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ నేతృత్వంలో టీమ్ ప్రజల కోసం పనిచేస్తోందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అందులో సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.


బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డిపై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ లేకున్నా.. ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ తెల్లని కాగితం వంటి వారని, అనవసరంగా ఎందుకు ఇంకు చల్లుతారని ప్రశ్నించారు. బట్ట కాల్చి ఉత్తమ్ మీద వేయడం కరెక్ట్ కాదని మహేశ్వర రెడ్డికి సూచించారు. ఉత్తమ్‌ను ఇబ్బంది పెట్టడంలో మహేశ్వర రెడ్డికి ఒనగూరే ప్రయోజనం ఏంటో అర్థం కావడం లేదన్నారు.


బీజేఎల్పీ నేత అయినప్పటికీ మహేశ్వర రెడ్డికి తగిన గుర్తింపు లభించలేదని జగ్గారెడ్డి విమర్శించారు. గుర్తింపు కోసమే ఉత్తమ్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన చేసే ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే మీడియా ముందు పెట్టాలని సవాల్ విసిరారు. లేదంటే సైలెంట్‌గా ఉండాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని స్పష్టం చేశారు.



Read Latest
Telangana News and National News

Updated Date - May 23 , 2024 | 03:04 PM

Advertising
Advertising