AP Jitender Reddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటా..
ABN, Publish Date - Jun 27 , 2024 | 04:10 AM
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటానని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి
తెలంగాణ భవన్‌లో పదవీ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటానని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. పెండింగ్‌లో ఉన్న విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని, అందుకు కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. బుధవారం, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
కృష్ణా నుంచి రావలసిన నీటి వాటా కూడా రాలేదని, సాగు, తాగునీరు సాధించడం కోసం రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాంనాయక్, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, యన్నం శ్రీనివా్‌సరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, శ్రీహరి తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Jun 27 , 2024 | 04:10 AM