Share News

Kadiyam Srihari: పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసింది దోపిడీ.. భూకబ్జాలే

ABN , Publish Date - Dec 09 , 2024 | 04:10 AM

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసింది దోపిడీ, భూకబ్జాలేనని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.

Kadiyam Srihari: పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసింది దోపిడీ.. భూకబ్జాలే

  • ఏడాదిలోనే రేవంత్‌ అద్భుత పాలన: కడియం శ్రీహరి

వరంగల్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసింది దోపిడీ, భూకబ్జాలేనని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. పదవులను అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకుందని విమర్శించారు. ఆదివారం హనుమకొండ జిల్లా మడికొండలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు.


ఏడాదిలోనే రేవంత్‌రెడ్డి అద్భుత పాలన అందించారని కొనియాడారు. కాళేశ్వరం నీళ్లు లేకుండానే ఒక్క ఖరీ్‌ఫలోనే 66.70 లక్షల ఎకరాల్లో వరిసాగు చేసి 1.53 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారన్నారు. ఏకకాలంలో రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ సర్కారుదేనని మెచ్చుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, యశస్వినిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2024 | 04:10 AM