ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kargil War: సైనికుల త్యాగం చిరస్మరణీయం: కిషన్‌రెడ్డి

ABN, Publish Date - Jul 27 , 2024 | 04:49 AM

కార్గిల్‌ యుద్ధాన్ని భారత్‌ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కార్గిల్‌ యుద్ధాన్ని భారత్‌ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు. దేశ రక్షణ వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,21,940.85 కోట్లను రక్షణ శాఖకు కేటాయించామని తెలిపారు.


‘వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌’ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 2014లో సైనికుల పెన్షన్‌ కోసం రూ.40 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి బడ్జెట్‌ లో రూ. 1.41 లక్షల కోట్లు కేటాయించామని వివరించారు. పదవీ విరమణ చేసిన సైనికుల కుటుంబాలకు వైద్య సదుపాయాల కోసం రూ. 6,968 కోట్లను కేటాయించామని తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 04:49 AM

Advertising
Advertising
<