ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Adluri Laxman Kumar: తెలంగాణ తల్లి విగ్రహంపై కేటీఆర్ విమర్శలు.. కాంగ్రెస్ నేత మాస్ వార్నింగ్

ABN, Publish Date - Dec 06 , 2024 | 08:36 PM

దళితుల భూములను రాబందులా బీఆర్ఎస్ లాక్కుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. ముగ్గురు నలుగురు తప్పా బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారని అన్నారు. అంబేద్కర్ వర్ధంతి రోజు బీఆర్ఎస్ నేతల నిరసన ఏంటని నిలదీశారు.

హైదరాబాద్: కేసీఆర్ కుర్చీ కోసం మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సచివాలయంలో పెడుతున్నామని తెలిపారు. గాంధీభవన్ లో ఇవాళ(శుక్రవారం) ఏబీఎన్ తో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ...తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఎవరు అడ్డుకుంటారో చూద్దామని సవాల్ విసిరారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎవరు పెకిలిస్తారో రావాలని అన్నారు. బీఆర్ఎస్ నాయకులంతా దుప్పట్లు కప్పుకుని పడుకున్నారని ఎద్దేవా చేశారు. ముగ్గురు నలుగురు తప్పా బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారని అన్నారు. అంబేద్కర్ వర్ధంతి రోజు బీఆర్ఎస్ నేతల నిరసన ఏంటని అడ్లూరి లక్ష్మణ్ నిలదీశారు.


అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు. సంవత్సరంలో తమ ప్రభుత్వంలో అద్భుతమైన పాలన అందించామని తెలిపారు. అంబేద్కర్ వర్దంతి రోజు బీఆర్ఎస్ నిరసనలు దేనికి సంకేతమని అన్నారు. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహంపై కేటీఆర్ విమర్శలు దేనికి సంకేతమని అడిగారు. అంబేద్కర్ పేరు మీద ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రద్దు చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. దళితబందు పేరుతో దళితులను బీఆర్ఎస్ దగా చేసిందని అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు.


దళితుల భూములను రాబందులు లాగా బీఆర్ఎస్ లాక్కుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని విమర్శించారు. గిల్లి పంచాయతీ పెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను అడుగడుగునా అడ్డుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్ వాళ్ల పాలనను మర్చిపోయారా అని అడిగారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు మరోసారి బుద్ది చెబుతారని హెచ్చరించారు. పదేళ్లు ప్రభుత్వ హాస్టళ్లను పట్టించుకోని బీఆర్ఎస్.. ఇప్పుడు పర్యటనలు చేస్తోందని ధ్వజమెత్తారు. పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీక్షా దివాస్ ఎందుకు చేయలేదని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Congress: అస్థిరత నుంచి సుస్థిరత దాకా

CM Revanth Reddy: కేసీఆర్‌! ప్రతిపక్ష నేతగా.. నీ డ్యూటీ చెయ్‌

KTR: రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా.. కాంగ్రెస్ తల్లినా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 08:44 PM