గౌరిగుండాల జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
ABN , Publish Date - Jul 22 , 2024 | 12:48 AM
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో ని సబ్బితం గట్టుసింగారం గౌరిగుండాల జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్జీ కృష్ణ అన్నారు.

పెద్దపల్లి రూరల్, జూలై 21 : కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో ని సబ్బితం గట్టుసింగారం గౌరిగుండాల జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్జీ కృష్ణ అన్నారు. ఆదివారం బసంత్‌నగర్ ఎస్‌ఐ ఆర్ స్వామి ఆధ్వర్యంలో సబ్బితం గ్రామం పరిధిలోని జలపాతం వెళ్లే దారిలో బారీకేడ్ లు, హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దారిని మూసివేశారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ సందర్శించి పరిసరాలను పరిశీలించారు. వర్షాలు అధికంగా కురుస్తున్న దృష్ట్యా పెద్దపల్లి డివిజన్ పరిధిలోని మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, వా తావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిందని, దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధిక వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జలపాతం సందర్శన కొద్దిరోజులు నిషేధిస్తున్నట్లు పేర్కోన్నారు. జలపాతం వెళ్లే దారిలో ప్రత్యేకంగా పోలీ స్ బందోబస్త్ ఏర్పాటుచేసినట్లు, సందర్శనకు వచ్చేవారికి గ్రామస్థులు సైతం అవగా హన కల్పించాలని సూచించారు. వారి వెంట పెద్దపల్లి సీఐ కృష్ణ, పెద్దపల్లి, బసంత్ నగర్ ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు, ఆర్.స్వామిలతో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే మండలంలోని పెద్దబొంకూర్ నుంచి కొత్తపల్లి వెళ్లే దారిలో కాజ్‌వేపై అధిక వర్షాలు కురుస్తున్న దృష్ట్యా రోడ్డుపై నీరు ప్రవహించే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉం డాలన్నారు. ఆదివారం నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.