ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA Paul: వైఎస్ జగన్ వేస్ట్.. కేసీఆర్ డిక్టేటర్.. రేవంత్ సేవకుడు!

ABN, First Publish Date - 2024-02-10T13:21:21+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కేఏ.పాల్ ప్రశంసల్లో ముంచెత్తారు. రేవంత్ గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితి మారుతోందన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ప్రశంసల్లో ముంచెత్తారు. రేవంత్ గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితి మారుతోందన్నారు. వచ్చే అక్టోబర్ నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సైతం మారబోతోందని తెలిపారు. రేవంత్‌తో కలిసి ప్రపంచంలోని బిలియనీర్స్‌ను కలిసి పెట్టుబడులు తెస్తామన్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు కూడా ఇంగ్లీష్ తెలియనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. రేవంత్ ఇంగ్లీష్‌పై విమర్శలు చేయడం తెలివి తక్కువతనమని ఫైర్ అయ్యారు.

కేసీఆర్‌పై ఇలా..!

మాజీ సీఎం కేసీఆర్ కు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అసలు పోలికే లేదని కేఏ.పాల్ అన్నారు. కేసీఆర్ డిక్టేటర్ లా వ్యవహరిస్తే.. రేవంత్ మాత్రం ప్రజల కోసమే పని చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.12లక్షల కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. కాగా.. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేఏ.పాల్ ఆయన కోడలితో కలిసి అసెంబ్లీకి చేరుకున్నారు. అనుమతి లేదంటూ ఎంట్రీ వద్ద భద్రత సిబ్బంది వీరిని ఆపేశారు. కొంత సమయం తర్వాత అనుమతి రావడంతో సెక్రెటరీ ఛాంబర్ లో కూర్చున్నారు.


మరోవైపు.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు కేఏ.పాల్ ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ వేస్ట్ ఫెల్లో అని, రూ.పది లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - 2024-02-10T13:32:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising