Share News

TG News: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

ABN , Publish Date - Nov 30 , 2024 | 11:14 AM

Telangana: అమెరికాలో ఖమ్మం యువకుడిపై కాల్పులు కలకలం రేపుతోంది. చికాగోలో దుండగుల కాల్పుల్లో జిల్లాకు చెందిన నూకరపు సాయి తేజ మృతి చెందాడు. నాలుగు నెలల క్రితమే ఉన్నత విద్య కోసం సాయి తేజ అమెరికాకు వెళ్లాడు. చివరకు దుండగుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం రమణగుట్ట ప్రాంతంలో నూకారపు సాయి తేజ కుటుంబం నివాసం ఉంటోంది.

TG News: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
Khammam youth shot dead in Chicago

ఖమ్మం, నవంబర్ 30: ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్తున్న ఎంతో మంది యువత అనుకోని ప్రమాదాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. మంచి విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగం కోసం ఉన్న ఊరును, కుటుంబసభ్యులను వదిలి యువతీ, యువకులు విదేశాల బాట పడుతున్నారు. కొంత మంది అనుకున్న లక్ష్యాలను సాధించి విదేశాల్లో మంచి ఉద్యోగంతో స్థిరపడుతుండగా మరికొందరు మాత్రం ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు.

TG Govt: లగచర్ల భూసేకరణ... నిన్న రద్దు.. నేడు నోటిఫికేషన్


రోడ్డు ప్రమాదాలు కారణంగా కొందరు, ఎంజాయ్ చేయడానికి వెళ్లి మరికొంతమంది మృత్యుఒడిలోకి వెళ్తున్నారు. అయితే విదేశాల్లో గన్ కల్చర్ ఎక్కువ అన్న విషయం అందరికి తెలిసిందే. అక్కడి వారు గన్‌లతో బెదిరించి మరీ దొంగతనానికి పాల్పడుతుంటారు. డబ్బులు ఇవ్వకపోతే విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు. డబ్బులు ఇచ్చినప్పటికీ ఆగంతకులు అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటారు. ఇదేవిధంగా ఉన్నత చదవుల కోసం అమెరికాకు వెళ్లిన ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ఇలాంటి ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు.


అమెరికాలో ఖమ్మం యువకుడిపై కాల్పులు కలకలం రేపుతోంది. చికాగోలో దుండగుల కాల్పుల్లో జిల్లాకు చెందిన నూకరపు సాయి తేజ మృతి చెందాడు. నాలుగు నెలల క్రితమే ఉన్నత విద్య కోసం సాయి తేజ అమెరికాకు వెళ్లాడు. చివరకు దుండగుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం రమణగుట్ట ప్రాంతంలో నూకారపు సాయి తేజ కుటుంబం నివాసం ఉంటోంది. కొద్ది రోజుల క్రితమే ఎంఎస్ చదివేందుకు సాయి తేజ అమెరికాలోని చికాగో నగరానికి వెళ్లాడు. చదువుకుంటూనే సదరు విద్యార్థి పార్ట్‌ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో దుండగుల కాల్పుల్లో విద్యార్థి చనిపోయాడు. పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు ముసుగువేసుకుని వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు.


దీంతో భయాందోళనకు గురైన సాయి తేజ తన దగ్గర ఉన్న డబ్బులను వారికి ఇచ్చేశాడు. డబ్బులు ఇచ్చిన తరువాత అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన దుండుగులు.. విచక్షణ మరిచి విద్యార్థిపై కాల్పులు జరిపారు. సాయితేజ గుండెలపై కాల్చడంతో అక్కడిక్కడే కుప్పకూలి పడిపోయాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే అక్కడ ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని సాయి తేజను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే సాయి తేజ మృతి సమాచారాన్ని ఖమ్మం జిల్లాలోని తల్లిదండ్రులకు తెలియజేశారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత విద్య కోసం వెళ్లిన తమ బిడ్డ ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చికాగోలో ఉన్న సాయితేజ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

అర్ధరాత్రి గందరగోళం.. వార్డెన్‌ సస్పెండ్

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కథ విషాదాంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 30 , 2024 | 11:22 AM