ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ponguleti: ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సు.. మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..

ABN, Publish Date - Oct 12 , 2024 | 03:48 PM

తెలంగాణ ప్రాంతం ఆయిల్ పామ్ సాగుకు అనువైన ప్రాంతమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇకపై ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పామాయిల్ సాగు, విస్తరణ పెరుగుతుందని ఆయన చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రాంతం ఆయిల్ పామ్ సాగుకు అనువైన ప్రాంతమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇకపై ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పామాయిల్ సాగు, విస్తరణ పెరుగుతుందని ఆయన చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయానికి పెద్దపీట వేసినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణ రైతులు సంతోషంగా ఉండేలా కాంగ్రెస్ పాలన సాగుతోందని, వారికి రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నామని పొంగులేటి చెప్పారు. అశ్వరావుపేటలో ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు సాగు, విస్తరణపై అవగాహన కల్పించారు.


ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. "ఆయిల్ పామ్ సాగుకు పుట్టినిల్లు అశ్వరావుపేట. మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా జిల్లాలో తొలి ఆయిల్ పామ్ మొక్క నాటారు. గత ప్రభుత్వంలో నాకున్న అవకాశంతో అశ్వరావుపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించాను. తెలంగాణలో ఈ పంట సాగుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచాలని ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేశాం. ఈ మేరకు ఇంపోర్ట్ ట్యాక్స్ పెరగటం వల్ల పామాయిల్ గెలల ధర పెరిగింది. రానున్న రోజుల్లో గెలలు ధర టన్ను రూ.20వేలకు పైగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తేనే డిమాండ్ తగ్గుతుంది. భద్రాద్రి జిల్లాలో గిరిజన దళిత రైతులకు పట్టాలు ఉన్నా, లేకున్నా పంట సాగుకు వారిని ప్రోత్సహించాలి. రుణమాఫీ చేసి కాంగ్రెస్ చరిత్రలో నిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి పంట కాలంలో రుణమాఫీ చేసిన సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బీమాతో కాంగ్రెస్ పాలనలో రైతు రాజ్యం ఏర్పడింది. యావత్ దేశానికే తెలంగాణ ఆయిల్ పామ్ హబ్‌గా మారనుంది" అని చెప్పారు.


ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని, రాగమయి, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: కేసీఆర్‌ బాధితులు చాలామంది ఉన్నారు..

Jubilee Hills: పెద్దమ్మ తల్లి దేవాలయానికి పోటెత్తిన భక్తులు: నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు

Updated Date - Oct 12 , 2024 | 03:49 PM