Kunamneni: కిషన్ రెడ్డి మోదీని మించి పోయాడు
ABN, Publish Date - Jun 30 , 2024 | 03:40 PM
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంట్లు చూస్తే అబద్ధాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మించిపోయారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) విమర్శించారు. ఎంఎండీఆర్ పేరుతో చట్టం ఏర్పాటు చేసి ఆ గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తున్నారన్నారు.
ఖమ్మం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంట్లు చూస్తే అబద్ధాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మించిపోయారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) విమర్శించారు. ఎంఎండీఆర్ పేరుతో చట్టం ఏర్పాటు చేసి ఆ గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తున్నారన్నారు. బీజేపీ ఆలోచనలు ఉన్న బొగ్గు గనుల జోలికి వెళ్లమని, కొత్త బొగ్గు గనులను విక్రయించేలా ఉందని విమర్శలు చేశారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలను ఈరోజు(ఆదివారం) నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ....బీజేపీ, కేసీఆర్ రెండు ఒక్కటే, కేసీఆర్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని సెటైర్లు చేశారు.
కేసీఆర్ ఇప్పుడు పోరాటం చేస్తామని చెబుతున్నారని.. పోరాటాలు చేసేది కేవలం కమ్యూనిస్ట్‌లు మాత్రమేనని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు రోడ్ల మీదకు రావాలని, లేకుంటే అది తమ పోరాటం కాదని చెప్పారు. ఒరిస్సా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బొగ్గు గనులను ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తుచేశారు, కిషన్ రెడ్డి మోదీతో మాట్లాడి తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న గనులను ప్రభుత్వానికి ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సందర్భంలో దూకుడుగా ఉండాలని. రేపు 5 వ తేదీన కోల్డ్ బెల్ట్‌ని బంద్ చేసి, కలెక్టరేట్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
‘‘సీపీఐ బలంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. తమిళనాడ్ వంటి ప్రాంతాల్లో కమ్యూనిస్ట్‌ల పట్ల ప్రజల్లో ఉన్న అభిమానన్ని గుర్తించారు. 100 ఏళ్లు వయస్సు కలిగిన పార్టీ లేదు. ఈ నాటికి కమ్యూనిస్ట్‌లకు కోట్ల మంది ప్రజలు ఆదరణ చూపెడుతున్నారు. బీజేపీ 400 స్థానాలు దాటాలని చెప్పిందని, 240 స్థానాలకు పడిపోవడం వెనుక కమ్యూనిస్ట్ ల సైద్ధాంతిక పోరాటం ఉందని గమనించాలి. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను జనాల్లోకి తీసుకెళ్లడం కమ్యూనిస్ట్ లతోనే సాధ్యం. బీజేపీ అయోధ్య వంటి స్థానాల్లో ఓడిపోవడం, జనరల్ స్థానంలో దళితుడు పోటీ చేసి గెలవడం కమ్యూనిస్ట్ ప్రభావితం ఉండటం కారణం’’ అని. తెలిపారు
సొంతంగా ముందుకెళ్తాం...
‘‘కమ్యూనిస్ట్‌ల బలాన్ని విస్తృత పరచాలి అనుకుంటున్నాం. కమ్యూనిస్ట్ లతో పొత్తులు కుదిరితే సంతోషం, లేకుంటే సొంతంగా ముందుకెళ్తాం. కాంగ్రెస్ నిలబడాలని మేము కోరుకుంటాం, కాంగ్రెస్ ప్రజల సమస్యల పట్ల ఆలోచించకుంటే మేము వాటిని ప్రజల్లోకి తీకెళ్తాం. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల స్వభావం గురించి మనం చర్చించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తన సొంత బలంతో గెలుపొందలేదు, బీఆర్ఎస్ బలహీనం అయిన చోట బీజేపీ పుంజుకుంది. బీఆర్ఎస్ బలహీనం అయిన చోట ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్‌పై ఏర్పడిన పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేయాలి అనుకుంటే ఆ స్థానంలో కాంగ్రెస్ లేదా కమ్యూనిస్ట్ పార్టీలకు మద్దతు చూపుతారు. అన్ని రంగాల్లో నిష్ణాతులైన కార్యకర్తలను తయారు చేయాలని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి గొప్ప సంపద బొగ్గు గనులు, దాని మీద ఎక్కువ హక్కులు మాకే ఉన్నాయి’’ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
Updated Date - Jun 30 , 2024 | 03:41 PM