ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. వాగులో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తుల మృతి.... మరొకరి గల్లంతు

ABN, Publish Date - Sep 08 , 2024 | 07:04 PM

ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోతగా వానలు కురుస్తుండటంతో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోగా మరొకరు గల్లంతయ్యారు.

ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోతగా వానలు కురుస్తుండటంతో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయి మృతిచెందగా.. మరొకరు గల్లంతయ్యారు.

ఎర్రుపాలెంలో...

వివరాల్లోకి వెళ్తే... ఎర్రుపాలెం మండ‌లంలోని భ‌వానిపురానికి భారీగా వరద వచ్చి చేరడంతో.. ఎర్రుపాలెం మండ‌లం భ‌వానిపురం గ్రామానికి చెందిన మ‌లిసెట్టి సాంబ‌శివ‌రావు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు.


ఈ ఘ‌ట‌న‌లో మృతుడు కుటుంబానికి ప్రభుత్వం త‌ర‌ఫున రూ. 5 ల‌క్షల చెక్కును ఉప ముఖ్యమంత్రి మల్లు భ‌ట్టి విక్రమార్క అందజేశారు.

దెందుకూరులో...

అయితే మరో సంఘటనలో భారీ వ‌ర్షాల‌తో ఏర్పడ్డ వ‌ర‌ద‌ల‌తో ఖ‌మ్మం జిల్లా అతాల‌కుత‌లమవుతోంది. అదే వ‌ర‌ద‌ల్లో మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలోని దెందుకూరు గ్రామ‌వాసి న‌న్నెబోయిన ప‌ద్మావ‌తి అనే మ‌హిళ ప్రమాద‌వ‌శాత్తూ వాగులో కొట్టుకుపోయి మృతిచెందింది. ఈ ఘ‌ట‌న‌లో మృతిరాలి కుటుంబానికి రూ. 5 ల‌క్షల‌ చెక్కును ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క అందజేశారు.


జగన్నాథపురంలో...

కాగా. చింతకాని మండలం జగన్నాథపురం వద్ద తుమ్మలమ్మ వాగులో మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ గ్రామానికి చెందిన పిల్లి వీరయ్య చేపల కోసం వెళ్లి తుమ్మలమ్మ వాగులో గల్లంతయ్యాడు. వీరయ్య కోసం తుమ్మలమ్మ వాగులో బంధువులు గాలిస్తున్నారు. అధికారులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Updated Date - Sep 08 , 2024 | 07:12 PM

Advertising
Advertising