ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Komatireddy Venkatareddy: కేసీఆర్‌ మతి స్థిమితం కోల్పోయారు

ABN, Publish Date - May 24 , 2024 | 03:01 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ సంక్షేమ పాలన చూసి కేసీఆర్‌ మతి స్థిమితం కోల్పోయారని, సీఎం రేవంత్‌రెడ్డికి భయపడే ఆయన అసెంబ్లీకి రావడం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ బాద్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తే గనక కొత్త దుకాణం పెట్టాలనే ఆలోచనతో హరీశ్‌రావు ఉన్నారని, జూన్‌ 5 తర్వాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం అవుతుందని పేర్కొన్నారు.

  • రేవంత్‌కు భయపడి అసెంబ్లీకి రావట్లే

  • దొడ్డు వడ్ల రైతులనూ ఆదుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • అమెరికాకు మంత్రి పయనం

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ సంక్షేమ పాలన చూసి కేసీఆర్‌ మతి స్థిమితం కోల్పోయారని, సీఎం రేవంత్‌రెడ్డికి భయపడే ఆయన అసెంబ్లీకి రావడం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ బాద్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తే గనక కొత్త దుకాణం పెట్టాలనే ఆలోచనతో హరీశ్‌రావు ఉన్నారని, జూన్‌ 5 తర్వాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం అవుతుందని పేర్కొన్నారు. ఎటువంటి అనుమతుల్లేకుండానే జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను నిర్మించారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కాంగ్రె్‌సకు 12కు తగ్గకుండా సీట్లొస్తాయని కేంద్రంలోనూ ‘ఇండియా కూటమి’ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎ్‌సకు రెండు, మూడు చోట్ల డిపాజిట్లు వస్తే అదే ఎక్కువన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డు వడ్లు పండించిన రైతులనూ ఆదుకుంటామని స్పష్టం చేశారు. గురువారం కోమటిరెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీజేపీలో సీనియర్‌ నాయకుడు రాజాసింగ్‌ను కాదని ఏలేటి బీజేపీఎల్పీ పదవిని తీసుకున్నారని, ఆయన పేరు పలకాలంటేనే తనకు అవమానంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌పై బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.


బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో, కవిత జైలుకు వెళ్లడంతో కేసీఆర్‌ నిస్పృహలో ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబం ఇక నుంచి బెయిల్‌ కోసం ప్రయత్నం చేసుకుంటే బెటర్‌ అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ మాటలు అసహ్యంగా ఉన్నాయని, అమెరికాలో చదువుకున్నానని ఆయన చెప్పుకొంటున్నా.. మాటలు మాత్రం అనాగరికంగా ఉన్నాయని విమర్శించారు. దుర్గం చెరువుపై కేబుల్‌బ్రిడ్జి నిర్మించి అభివృద్ధి చేశామని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారని, మరి.. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ ఎక్స్‌పెరస్‌ ఫ్లై ఓవర్‌లాంటివి నిర్మించిన తాము ఇంకెంత చెప్పుకోవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఐఏఎ్‌సలను పక్కన పెట్టిన కేటీఆర్‌.. కేవలం నలుగురైదుగురినే ప్రోత్సహించారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మద్యం అమ్మకాలు మాత్రమే పెరిగాయి తప్ప.. అభివృద్ధి జరగలేదని, వైన్‌ షాపుల పేరుమీద అమాయకుల నుంచి రూ.2,500కోట్లను గత ప్రభుత్వం రాబట్టిందని విమర్శించారు. అంతేకాకుండా ఒక్క టానిక్‌ వైన్‌షా్‌ప పేరుతోనే రూ.6వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.


ఇప్పుడు తాము టెట్‌కు రూ.2వేలు ఫీజు కట్టాలనే నిబంధనను పెట్టామని, అలవికాని పథకాల హామీలను ఇచ్చామని తమను కేటీఆర్‌ విమర్శిస్తున్నారని.. మరి బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు రూ.500కే గ్యాస్‌, ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎందుకు అమలుచేయలేదని నిలదీశారు. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి తీన్మార్‌ మల్లన్నపై కేసులున్నాయని కేటీఆర్‌ అంటున్నారని, మరి.. కవిత లిక్కర్‌ కేసు గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌ తరహాలోనే సీఎం రేవంత్‌ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, తామంతా కలిసిమెలిసి పనిచేస్తున్నామన్నారు. జూన్‌ 6, 7, 8వ తేదీల్లో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లి, అక్కడ వివిధ కంపెనీలతో భేటీకానున్నట్టు తెలిపారు. ఎల్బీనగర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఎంసీఏ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా 14 అంతస్తులకు కుదిస్తామని చెప్పారు..


అమెరికా వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున అమెరికా వెళ్లారు. మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని సియాటెల్‌లో జరగనున్న తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) మెగా కన్వెన్షన్‌కు ఆయన ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఏప్రిల్‌లోనే అసోసియేషన్‌ అధ్యక్షులు, క్వాడ్రెంట్‌ టెక్నాలజీ సీఈవో కంచరకుంట్ల వంశీరెడ్డి బృందం మంత్రిని కలిసి కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరవ్వాలని ఆహ్వానించారు. ఈ కన్వెన్షన్‌లో మంత్రి పలు కంపెనీల ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా భేటీకానున్నారు. వారితో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, అందుకు ప్రభుత్వం కల్పిస్తున్న పలు సౌకర్యాలను వారికి వివరించనున్నట్టు తెలిసింది. కోమటిరెడ్డి తిరిగి 27న రాష్ట్రానికి రానున్నారు.

Updated Date - May 24 , 2024 | 03:01 AM

Advertising
Advertising