KTR: సర్కారు మార్గదర్శకాలే మాఫీకి మరణ శాసనాలు..

ABN, Publish Date - Jul 20 , 2024 | 05:38 AM

రాష్ట్రంలో రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని, సర్కారు రూపొందించిన మార్గదర్శకాలు రుణమాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: సర్కారు మార్గదర్శకాలే మాఫీకి మరణ శాసనాలు..

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని, సర్కారు రూపొందించిన మార్గదర్శకాలు రుణమాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. అన్నివిధాలా అర్హతఉన్నా.. ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారేలేరని, .రైతుల గోడు వినేవారే లేరని శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఆందోళనలో ఉంటే సంబరాలు జరుపుకోవడమేంటని ప్రశ్నించారు. జూన్‌లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలేదని, కౌలు రైతులకు.. ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనేలేదన్నారు.


పేదరిక నిర్మూలనలో తెలంగాణ రెండోస్థానం హర్షణీయం

పేదరికలో నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉందని నీతిఆయోగ్‌ నివేదికలో పేర్కొనడం హర్షణీయమని కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. పదేళ్లపాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతోపాటు సుస్థిర అభివృద్థికోసం కేసీఆర్‌ చిత్తశుద్థితో కృషి చేశారన్నారు. తాజాగా విడుదల చేసిన సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీ) లెక్కలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. గతప్రభుత్వం రాష్ర్టాన్ని మెరుగైన స్థితికి చేర్చిందని ఈ ప్రభుత్వం కూడా ఆ స్ఫూర్తిని కొనసాగించి అభివృద్థివైపు నడిపించాలని సూచించారు.

Updated Date - Jul 20 , 2024 | 05:39 AM

Advertising
Advertising
<