ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jupally Krishna Rao: హత్యలను రాజకీయాలకు ముడిపెడుతున్నారు..

ABN, Publish Date - May 25 , 2024 | 04:08 AM

హత్యారాజకీయాలకు పాల్పడుతోంది బీఆర్‌ఎస్సేనని.. వివాదాల కారణంగా జరిగిన హత్యలను రాజకీయాలకు ముడిపెడుతోందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో తన హస్తం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • కేటీఆర్‌, ప్రవీణ్‌వి అర్థం లేని ఆరోపణలు: జూపల్లి

  • ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ, షాల తప్పుడు ప్రచారం: షబ్బీర్‌

  • పాక్‌పై మెతక వైఖరే ఉంటే బంగ్లాదేశ్‌ ఏర్పడేదా?: నిరంజన్‌

  • తెలంగాణ ఇచ్చిన తల్లి హోదాలోనే సోనియా వస్తారు: వీహెచ్‌

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): హత్యారాజకీయాలకు పాల్పడుతోంది బీఆర్‌ఎస్సేనని.. వివాదాల కారణంగా జరిగిన హత్యలను రాజకీయాలకు ముడిపెడుతోందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో తన హస్తం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వివరాలు తెలియకుండా అలా ఎలా మాట్లాడతారని నిలదీశారు. ‘శ్రీధర్‌ రెడ్డి హత్యకు రాజకీయాలకు సంబంధం లేదు. ఆ ప్రాంతంలో శ్రీధర్‌రెడ్డి వల్ల చాలా కుటుంబాలు బాధపడ్డాయి. ఆయన కుటుంబంలోనూ ఆస్తి తగాదాలున్నాయి. శ్రీధర్‌రెడ్డి హత్య ఘటనకు కారణాలేంటో తెలుసుకునేందుకు పూర్తి విచారణ చేయిస్తాం.


కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఏమాత్రం సంస్కారం లేకుండా నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు వేయాల్సి వస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, నన్ను బీఆర్‌ఎస్‌ నుంచి బర్తరఫ్‌ చేసినందుకే మిమ్మల్ని జనాలు బర్తరఫ్‌ చేశారు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రె్‌సలో చేరిన నాటి నుంచి జూపల్లిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు.


మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే..

ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ, అమిత్‌ షా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలను చూస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ మండిపడ్డారు. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో కేసును ప్రభావితం చేసేందుకు యత్నిస్తే మోదీ, షాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాకిస్థాన్‌ పట్ల కాంగ్రె్‌సకు మెతకవైఖరే ఉంటే 1971లో బంగ్లాదేశ్‌ ముక్తి వాహినీకి మద్దతు ఇచ్చేదే కాదని, బంగ్లాదేశ్‌ ఏర్పడి ఉండేదే కాదని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ అన్నారు. ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియాగాంధీ ఏ హోదాలో వస్తున్నదంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నిస్తున్నడు. తెలంగాణ ఇచ్చిన తల్లి హోదాలోనే ఆమె వస్తున్నది’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు.

Updated Date - May 25 , 2024 | 04:08 AM

Advertising
Advertising