ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: సుంకిశాల ప్రమాదం రేవంత్‌రెడ్డి అసమర్థత వల్లే!

ABN, Publish Date - Aug 10 , 2024 | 03:51 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థత, చేతగానితనం వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

  • ప్రభుత్వ తప్పు లేకపోతే వారం ఎందుకు దాచారు?.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిందలు వేయడం చిల్లర వ్యవహారం

  • నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇప్పుడెందుకు రావడంలేదు?

  • న్యాయవిచారణ జరిపించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థత, చేతగానితనం వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పురపాలక శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రే ఈసంఘటనకు బాధ్యత వహించాలన్నారు. ఇందులో ప్రభుత్వ తప్పిదం లేకపోతే వారం రోజులు ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ నెల 2న ప్రమాదం జరిగితే.. సభలో ప్రకటన ఎందుకు చేయలేదని నిలదీశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగమాగం పనులు ప్రారంభించడం, గేట్లు అమర్చడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారని తెలిపారు.


ముఖ్యమంత్రి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిందలు వేయడం చిల్లర వ్యవహారమని, బాధ్యతల నుంచి తప్పించుకోవడం కాంగ్రెస్‌ నేతలకు తగదని అన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం కోసం కాళేశ్వరంపై ఆరోపణలు చేశారని, 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ప్రాజెక్టు చెక్కు చెదరలేదని కేటీఆర్‌ గుర్తుచేశారు. నీళ్ల విషయంలో కేసీఆర్‌ విజయాలను అంగీకరించలేని కురచ మనస్తత్వంతో కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని విమర్శించారు. కాళేశ్వరంపై ఆగమేఘాల మీద నివేదిక ఇచ్చిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అఽథారిటీ.. సుంకిశాలకు ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. ఘటనపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తక్షణమే న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.


  • మేడిగడ్డ ఘటనను మేం బయటపెట్టాం..

తమ హయాంలో జరిగిన మేడిగడ్డ ఘటనను తాము దాచలేదని, ఎన్నికల కోడ్‌ ఉన్నా బయటపెట్టామని కేటీఆర్‌ తెలిపారు. ఘటన జరిగిన రెండు గంటల్లోనే సర్దుతామని ఎల్‌అండ్‌టీ చెప్పిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సవాల్‌ చేశారు. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో తాగునీటి కొరత ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌లో కొరత లేకపోవటానికి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రణాళికలే కారణమని పేర్కొన్నారు. సుంకిశాలను 2024 వేసవి కాలానికి పూర్తిచేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క బిల్డప్‌ ఇచ్చారని, కానీ.. ఆ ప్రాజెక్టును చేపట్టింది, పూర్తిచేసింది కేసీఆరేనని స్పష్టం చేశారు. పేర్లు మార్చడమే మార్పు కాదని, భట్టి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.

Updated Date - Aug 10 , 2024 | 03:51 AM

Advertising
Advertising
<